తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు వీసీ(వైస్ ఛాన్సలర్లు) నియామకానికి ప్రక్రియ ప్రారంభించింది. వీసీ పోస్టుల దరఖాస్తు కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. అర్హులైన వారు ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించిందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి తెలిపింది. కాగా.. వీసీల పదవి కాలం మే లో ముగియనుంది. ఆ లోపే ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అందుకోసం త్వరలో సెర్చ్ కమిటీలు వేయనుంది.
All India Builders Convention: హైటెక్స్ వేదికగా ఆలిండియా బిల్డర్స్ కన్వెన్షన్..
10 వర్సిటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ (వరంగల్), మహాత్మా గాంధీ యూనివర్సిటీ (నల్గొండ), శాతవాహన యూనివర్సిటీ (కరీంనగర్), తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్), పాలమూరు యూనివర్సిటీ (మహబూబ్‌నగర్), జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ (హైదరాబాద్) ఉన్నాయి. ఈ యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్ల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను విద్యాశాఖ ఆహ్వానించింది.
Karnataka: టీనేజ్ బాలికపై అత్యాచారం.. గర్భంతో ఉన్నానని తెలిసి సూసైడ్..