తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరుద్యోగుల విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టింది. గత పదేళ్లుగా బీఆర్ఎస్ నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యం వహించిందని ముందు నుండి ఆరోపిస్తూ వచ్చిన కాంగ్రెస్.. ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Read Also: Road Accident: మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్సై సహా ముగ్గురు మృతి
ఈ క్రమంలో కాంగ్రెస్ తమ హామీలను నెరవేర్చే పనిలో పడింది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. 11 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. అందుకోసమని ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. కాగా.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో పాటు 563 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.
Read Also: Minister Jogi Ramesh: నారా భువనేశ్వరి అసలు విషయం పసిగట్టారు.. అందుకే పోటీ అంటున్నారు..!
ఇదిలా ఉంటే.. తెలంగాణ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 563 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.