తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఆన్‌లైన్‌లో వచ్చే బిజినెస్ యాప్‌లను నమ్ముకుంటూ లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారు. మరి కొందరేమో ల్యాటరీ తగిలిందని గుర్తు తెలియని వ్యక్తులు పంపించే మెస్సేజ్‌లను గుడ్డిగా నమ్మి వాటిని ‘క్లిక్’ చేస్తూ లక్షల రూపాయలు తమ బ్యాంక్ ఖాతాలోంచి ఖాళీ చేసుకుంటున్నారు. మరికొంత మంది ఉద్యోగాలు కల్పిస్తామంటే నమ్మి నిలువునా మోసపోతున్నారు. ఇలా అధిక లాభాలు ఆశ చూపి.. ట్రేడింగ్ పేరుతో కోట్లు కొట్టేస్తున్నారు సైబర్ కేటగాళ్లు. ట్రేడింగ్ పేరుతో లాభాలు చూపెడతామని అమాయకుల దగ్గర నుంచి కోట్లు వసూలు చేసి చివరకు టోపీ తిప్పేస్తున్నారు.
Minister Dharmana Prasada Rao: తెరమీద బొమ్మలు చూడకండి.. రియల్ హీరో జగన్..
చార్టెడ్ అకౌంటెంట్, న్యాయవాదులే టార్గెట్ గా సైబర్ కేటుగాళ్లు పనిచేస్తున్నారు. పెద్ద ఎత్తున ట్రేడింగ్ చేసే న్యాయవాదులు, చార్టెడ్ అకౌంట్ లో సైబర్ కేటుగాళ్లు ట్రాప్ చేస్తున్నారు. ట్రేడింగ్ లో అధిక లాభాలు ఇప్పిస్తామని చెప్పి వారిని బుట్టలోకి దించుతున్నారు ఈ మాయగాళ్లు. దీంతో ఆశతో చార్టెడ్ అకౌంట్, న్యాయవాదులు వారి ఉచ్చులో పడుతున్నారు. వారం రోజుల పరిధిలో జంట నగరాల్లో సైబర్ నేరగాళ్లు రూ.20 కోట్లు కొట్టేశారు. వీఐపీలు, అడ్వకేట్లు, చార్టెడ్ అకౌంటెంట్లు ప్రొఫెషనల్ టార్గెట్ చేసుకొని నేరగాళ్లు దోచుకుంటున్నారు. భారీ మొత్తంలో లాభాలు చూపెట్టి డబ్బులు దోచుకుంటున్నారు. దీంతో.. నకిలీ ట్రేడింగ్ వెబ్ సైట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకుల వివరాలను ఎట్టి పరిస్థితిలో గుర్తుతెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దని జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల పట్ల ఆకర్షితులు కావద్దని ఆయన సూచించారు.
Minister Seethakka: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం..