మహాశివరాత్రి పర్వదినాన నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లక్ష్మీ కాలువలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు నిజమాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం గన్యా తండాకు చెందిన యువకులు సాయినాథ్, లోకేష్, మున్నాగా గుర్తించారు. వీరి సరదాగా కాలువలోకి దిగడంతో అందులోనే జారిపోయారు. అయితే గల్లంతైన యువకుల కోసం అధికారులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే లక్ష్మి కాలువకు నీటి విడుదల అవుతుండగా.. యువకులను గుర్తించడం కోసం నీటి విడుదలను నిలిపివేసి గజ ఈతగాళ్లతో వెతుకుతున్నారు. కాగా.. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఈ విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ కొడుకులు నీటిలో పడిపోయారని తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు.