Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmana Krishnadasu: శ్రీకాకుళం జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన జిల్లాలో నెలకొన్న వ్యవసాయ పరిస్థితులను వివరించారు. వర్షాలు సరిగ్గా లేకపోవడంతో పంటల సాగు ఆలస్యమైందని, ఇప్పటికే సాగు చేసిన పంటలకు కూడా అవసరమైన ఎరువులు సక్రమంగా అందడం లేదని తెలిపారు. ప్రస్తుతం ఎకరాకు అర బస్తా చొప్పున మాత్రమే ఎరువులు అందుతున్న పరిస్థితి ఉందని ధర్మాన కృష్ణదాసు పేర్కొన్నారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్న సమయంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులను అందించేవాళ్లమని చెప్పారు. పంటల ఇన్సూరెన్స్‌ను కూడా ప్రభుత్వమే చెల్లించేదని, దీంతో రైతులు ధైర్యంగా, సౌకర్యంగా వ్యవసాయం చేసేవారని తెలిపారు.
ప్రస్తుతం రైతులకు గతంలో అందిన గౌరవం, రైతు కోసం ఎంత చేసినా తక్కువే అనే భావన కనిపించడం లేదని ధర్మాన కృష్ణదాసు విమర్శించారు. దీనికి భిన్నంగా ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ పరిస్థితిని రైతులు కూడా పూర్తిగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉండటంతో పాటు ఎరువుల కొరత తీవ్రంగా ఉందని ధర్మాన కృష్ణదాసు తెలిపారు. చివరకు పక్క రాష్ట్రం ఒడిశా నుంచి ఎరువులు కొనుగోలు చేసి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఒక్కో 50 కేజీల ఎరువుల బస్తాపై సుమారు రూ.800 వరకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు.
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
పెద్ద నాయకులే ఎరువులను దాచిపెడుతున్నారనే ఆవేదనను రైతులు వ్యక్తం చేస్తున్నారని ధర్మాన కృష్ణదాసు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల సమస్యలపై గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, సాగునీరు అందించడంతో పాటు పంటల రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు మాజీ సీఎం వైఎస్ జగన్‌ను గుర్తు చేసుకుంటున్నారని ధర్మాన కృష్ణదాసు వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాసు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!