Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎన్నో సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. పెద్ద సినిమాలు షూటింగ్ డిలే వల్ల లేదా ఇతర కారణాల వల్ల డిలే అవుతున్నాయంటే అర్థం ఉంది కానీ, చిన్న సినిమా మేకర్స్ కూడా రిలీజ్ డేట్‌ని చాలా లైట్ తీసుకుంటున్నారు.
నిజానికి ఈ వారం ‘అనుమాన పక్షి’ అనే సినిమాతో పాటు ‘హనుమాన్ అన్ష్’ సినిమా తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది. అదే విధంగా ‘418’ అనే కన్నడ సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది. ఇందులో కన్నడ సినిమా మాత్రం పాన్ ఇండియా రిలీజ్ స్ట్రాటజీ కారణంగా వాయిదా పడితే, ‘హనుమాన్ అన్ష్’ తెలుగు డబ్బింగ్ సెన్సార్ పూర్తి కాకపోవడంతో పాటు, ‘అనుమాన పక్షి’ సినిమా సెన్సార్ పూర్తి కాకపోవడంతోనే రిలీజ్ వాయిదా పడింది.
Also Read
నిజానికి ‘అనుమాన పక్షి’ సినిమా కంటెంట్ డ్రివెన్ ఫిలిం. సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది, సినిమా టీం ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది. కానీ, సెన్సార్ విషయంలో మాత్రం చివరి నిమిషం వరకు లైట్ తీసుకున్నారు. ఈ సినిమాకి ముందే సెన్సార్ అప్లై చేసుకొని ఉంటే, ఈపాటికి సినిమా రిలీజ్ కి రెడీ అయి ఉండేది. ఈ సినిమా ఉదాహరణ మాత్రమే, ఇలా చాలా సినిమాలు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసి కూడా చివరి వరకు సెన్సార్ జోలికి వెళ్లడం లేదు.
ఒక్కోసారి సెన్సార్ వాళ్ళు ఏకంగా పేరునే మార్చేయాలని చెబుతున్న క్రమంలో, ఆ సినిమాలు ఒక్క దెబ్బకు ఎప్పుడో రిలీజ్ కావాల్సినవి, ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నాయి. కాబట్టి చిన్న సినిమా మేకర్స్ తమ కంటెంట్ రెడీ అవ్వగానే సెన్సార్ కి వెళితే సాధ్యాసాధ్యాలు అర్థమవుతాయి. అప్పుడే చిన్న సినిమాలను అయినా టైంకి తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే, పెద్ద సినిమాల బడ్జెట్లతో పాటు కొన్ని కొన్ని అనుకూలించవు. చిన్న సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే సినీ పరిశ్రమ ఇబ్బంది పడక తప్పదు.
తాజావార్తలు
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!