తెలంగాణ కేబినెట్ మంగళవారం (మార్చి 11) సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. రేపటి క్యాబినెట్ లో పలు అంశాలపై చర్చించనున్నారు. మహిళలకు వడ్డీలేని రుణాలు, 2500 రూపాయల ఆర్థిక సహాయం పై ప్రకటన.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. కొత్త రేషన్ కార్డుల జారీకి అనుమతి.. 2008 డీఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు.. 11 కొత్త బీసీ కార్పోరేషన్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం పై చర్చించనున్నారు.
నెలవంక దర్శనంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, క్రమశిక్షణ పాటిస్తారని, పెద్ద ఎత్తున పేదలకు జకాత్, ఫిత్రా పేరుతో దానధర్మాలు చేస్తారని గుర్తు చేశారు. రంజాన్ మాసం ఆదర్శవంతమైన జీవనానికి ప్రేరణనిస్తుందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ మాస వేడుకలను సుఖసంతోషాలతో జరుపుకోవాలని, ప్రార్థనలతో అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు.
ఉదయగిరి అభివృద్ధి ప్రధాత మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావును నెల్లూరులోని అతిధి గ్రౌండ్ హోటల్లో సోమవారం ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఘనంగా సన్మానించారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మీ రాజకీయ అనుభవాన్ని జోడించి తనను గెలిపించాలని కాకర్ల సురేష్ కోరారు. నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం బొల్లినేని వెంకట రామారావు ఆధ్వర్యంలో నిర్వహించగా, నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు సంబంధించిన మండల కన్వీనర్లు, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావుకు జాతీయస్థాయిలో పదవి…
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో భాగ్యనగరంలో పర్యాటకానికి సంబంధించిన మరో కొత్త ప్రాజెక్టు ప్రజలకు అంకితం కానుంది. అత్యాధునిక సాంకేతికతతో వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటేన్ పై లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేపు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ లైట్ అండ్ సౌండ్ షోలో.. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన ‘కోహినూర్’ వజ్రం గురించిన కథ కూడా ఉంటుంది. తెలంగాణ భూముల్లోనే కోహినూర్ వజ్రం లభించిన సంగతి తెలిసిందే.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ ప్రజా దీవెన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ బుటకపు వాగ్దానాలు చేసి తెలంగాణా ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితం చేసి కేసీఆర్ ను బొంద తీసి పెట్టారని విమర్శించారు. ఇదిలా ఉంటే.. ఇండ్లు లేని పేద…
ఆదిలాబాద్ బీజేపీలో నూతన చేరికల దుమారం చెలరేగింది. నిన్న బీజేపీలో గడ్డం నగేష్ చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బిఎల్ సంతోష్, లక్ష్మణ్ ని ఆదిలాబాద్ బీజేపీ నేతలు కలిశారు. బీజేపీలో నగేష్ చేరిక, లోక్ సభ స్థానాన్ని ఇవ్వడాన్ని ఆదిలాబాద్ బంజారా నేతలు రమేష్ రాథోడ్, రాథోడ్ బాపురావు(మాజీ ఎమ్మెల్యే) వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా రమేష్ రాథోడ్ మాట్లాడుతూ.. పార్టీలో మొదటి నుంచి పని చేస్తున్న వారికి లోక్ సభ టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరామని తెలిపారు. టికెట్ ఇస్తామని ఎవరికి…
విరాట్ కోహ్లీ నేటితో ఆర్సీబీతో 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 2008 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరిన విరాట్ కోహ్లీ.. అప్పటి నుంచి వారితోనే కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు లీగ్ లోని ప్రతి సీజన్ లో ఒక ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ మొదటగా రూ.12 లక్షలకు ఆర్సీబీలో చేరాడు. ఐపీఎల్ 2008 డ్రాఫ్ట్ లో విరాట్ కోహ్లీ రూ.12 లక్షలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాడు.
రేపు కరీంనగర్లో బీఆర్ఎస్ 'కథనభేరి' సభ నిర్వహించబోతుంది. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభ వివరాలను తెలిపారు. రేపు సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య కార్యక్రమాలన్నీ కరీంనగర్ నుండే కేసీఆర్ ప్రారంభిస్తారు.. అదే సెంటిమెంట్ తో పార్లమెంట్ ఎన్నికల కథనభేరి కూడా కరీంనగర్ నుండే ప్రారంభం అవుతోందని గంగుల కమలాకర్ తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతికేత మొదలైందని, ఈ ప్రభుత్వంలో…
బీజేపీ రెండో జాబితాను విడుదల చేసేందుకు సిద్ధం అయింది. అందుకోసం.. సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో కర్ణాటక, తెలంగాణ, గుజరాత్లతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే 195 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ అధిష్టానం.. మరో 150 మందిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. తొలి జాబితాలో తెలంగాణలోని 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. మిగిలిన 8 స్థానాలపై నేటి సమావేశంలో క్లారిటీ రానుంది.
గవర్నర్ తమిళిసై పై మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేశారు. సిద్ధిపేటలో రూ.5 లక్షలతో నిర్మించే ఏకలవ్యమిత్ర మండలి భవనానికి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా ఎరుకలి కులానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణకి కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.. కానీ గవర్నర్ మాత్రం ఆమోదించకుండా ఏ విధంగా అన్యాయం చేశారో అందరికీ తెలుసని ఆరోపించారు. కేసీఆర్ చేసిన దానిని రిజెక్ట్ చేసే అధికారం లేదని కోర్టు చెప్పింది.. హైకోర్టు ఈ విషయాన్ని పునర్ పరిశీలించాలని చెప్పిందని హరీష్ రావు…