ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలోని 60 కుటుంబాలకు చెందిన వాల్మీకులు గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, మార్కాపురం శాసన సభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి సమక్షంలో వైఎస్సార్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి కుందూరు నాగార్జున రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలో మేజర్ పంచాయతీ అయిన ముండ్లపాడు గ్రామ సర్పంచ్ పదవి విజయావకాశాలకు వాల్మీకి ఓటింగ్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది.
Read Also: KA Paul: పవన్‌పై పాల్ సంచలన వ్యాఖ్యలు.. ఇక, సినిమాలకు పనికిరాడు..!
గతంలో ఎమ్మెల్యే, సర్పంచ్ ఎన్నికల్లో వాల్మీకుల మూకుమ్మడి ఓటింగ్ వలన పంచాయతీలో గెలుపుకు వాల్మీకులు కీలకంగా మారారు. చిన్న చిన్న సమస్యలతో పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ బొమ్మని వెంకటేశ్వర్లు, మండ్ల రంగస్వామీ (బువ్వన్న), ఎడమ రామ్మూర్తి నాయుడు ఆధ్వర్యంలో దాదాపు 80 శాతం ఓటింగ్ వైసీపీకి అనుకూలమైనట్లు గ్రామస్థాయి నాయకులు చెబుతున్నారు.
Read Also: Ponnam Prabhakar: పలు కార్పొరేషన్లకు మంత్రి మండలి ఆమోదం..
ఈ క్రమంలో.. మేజర్ పంచాయతీ అయిన ముండ్లపాడు అభివృద్ధి పై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలని, తమకున్న నీటి సమస్య గురించి ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి వాల్మీకులు వివరించారు. దీంతో.. ఖచ్చితంగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, నీటి సమస్య పరిష్కారానికి వెంటనే బోర్ వేయిస్తానని నాగార్జున రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే త్వరలో గ్రామానికి వచ్చి ప్రతీ ఒక్కరిని కలుస్తానని తెలిపారు.