Bhatti Vikramarka: యాదగిరిగుట్టలో నాకేం అవమానం జరగలేదు.. భట్టి రియాక్షన్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో పాలు పలువురు మంత్రులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే.. అయితే, పూజలో కూర్చున్న సందర్భంగా రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పెద్ద పీటలపై కూర్చోగా… డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చిన్న పీటపై కూర్చున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించాయి. దళిత నేతకు దేవుడి సమక్షంలో తీవ్ర అవమానం జరిగిందంటూ కామెంట్స్ చేశారు. ఈ అంశంపై భట్టి విక్రమార్క స్పందించారు.
యాదగిరిగుట్టలో నాకేం అవమానం జరగలేదు.. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా అంత సంకుచిత భావం ఉన్న వాళ్ళు కాదు అని అన్నారు. నిన్న(సోమవారం) నేను పేదలకు ఇండ్లు ఇస్తున్న అనే సంతోషంలో ఉన్నా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూసి.. సీఎం మాట్లాడారని తెలిపారు. కావాలనే తాను చిన్న పీట మీద కూర్చున్నానని చెప్పారు. భక్తి భావంతో అలా కూర్చున్నా.. తనకు ఆత్మభిమానం ఎక్కువ అని అన్నారు. నా ఆత్మభిమానంకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండదని భట్టి విక్కమార్క చెప్పారు. తనను ఎవరూ అవమానించలేదని, దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు.
Also Read
మరోవైపు.. యాదగిరిగుట్టలో ఏర్పాట్లన్నీ తానే చూశానని భట్టి విక్రమార్క తెలిపారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యాదాద్రి ఘటనపై వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఉద్యోగులకు డీఏ కూడా ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం చూపుతున్నామన్నారు. పరిపాలన చేసిన అనుభవం ఉన్న కేసీఆర్.. తమపై ఎలా పడితే అలా మాట్లాడొద్దని సూచించారు. మాట్లాడాడు అంటే దుర్భుద్ధితో మాట్లాడిన మాటలు అని ఆరోపించారు.
తాజావార్తలు
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!