TSRTC: మరో కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ శ్రీకారం.. త్వరలో పార్శిళ్లు ఇంటి వద్దనే పికప్, డెలివరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్ విభాగ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తున్నామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు త్వరలోనే పార్శిళ్లను ఇంటి వద్దనే పికప్, డెలివరీ చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ మోడల్ కౌంటర్‌ను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ప్రారంభించారు. కొత్త కౌంటర్‌లో ఒక పార్శిల్‌ను బుకింగ్ చేసి రశీదును వినియోగదారుడికి ఆయన అందజేశారు. అనంతరం లాజిస్టిక్స్ విభాగ కొత్త లోగో, బ్రోచర్ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. పార్శిళ్ల హోం పికప్, డెలివరీ కోసం వినియోగించే కొత్త వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్ పోటీ చేసేది అక్కడి నుంచే.. అధికారిక ప్రకటన
Also Read
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
- Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
- PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
అనంతరం టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం తెలంగాణలో అతివేగంగా పార్శిళ్లను డెలివరీ చేసే వ్యవస్థ అని అన్నారు. ప్రతి రోజు సగటున 15 వేల పార్శిళ్లను బట్వాడా చేస్తున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 60 లక్షల పార్శిళ్లను టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో రవాణా చేశామని పేర్కొన్నారు. ఆ పార్శిళ్ల రవాణా వల్ల టీఎస్‌ఆర్టీసీకి సుమారు రూ.120 కోట్ల రెవెన్యూ వచ్చిందని వెల్లడించారు. “సంస్థకు టికెట్ ఆదాయం 97 శాతం వస్తుండగా.. టికెటేతర ఆదాయం 3 శాతమే వస్తోంది. ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయించిన సంస్థ.. ప్రైవేట్ మార్కెట్‌కు ధీటుగా లాజిస్టిక్స్ విభాగాన్ని బలోపేతం చేస్తోంది. అందులో భాగంగానే దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో మోడల్ కౌంటర్‌ను ప్రారంభించాం. త్వరలోనే ఇలాంటి కౌంటర్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నాం. లాజిస్టిక్స్ విభాగ విస్తరణతో పాటు పెట్రోల్ బంక్‌ల ఏర్పాటు, జీవా వాటర్ బాటిల్‌ను అందుబాటులోకి తీసుకురావడం, బస్ స్టేషన్‌లలో స్టాళ్లలను యాజమాన్యం నిర్మిస్తోంది.” అని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు.
Varalaxmi Sarathkumar: పిచ్చి పిచ్చి రాతలు రాస్తే.. పరువు నష్టం దావా వేస్తా..
ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతంలో పార్శిళ్ల హోం పికప్, డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తున్నామని.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. లాజిస్టిక్స్ సేవలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ నంబర్ 040-69440069 గానీ, https://www.tsrtclogistics.in వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ సీవోవో డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, కృష్ణకాంత్, వెంకటేశ్వర్లు, సీటీఎం(కమర్షియల్) శ్రీధర్, హైదరాబాద్ ఆర్ఎం వరప్రసాద్, డిప్యూటీ ఆర్ఎం (లాజిస్టిక్స్) సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!