బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్‌లో బీజేపీ ముఖ్యనేతలు పార్లమెంట్ కన్వీనర్లు, జాతీయ కార్యవర్గ సభ్యులతో అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ.. ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. లోకసభ ఎన్నికల ప్రచార వ్యూహాలు, సభలు సమావేశాలు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఆరా తీశారు. పార్టీలో నేతల మధ్య విభేదాలు ఉంటే పక్కన పెట్టి, సమన్వయంతో పనిచేయాలని అమిత్ షా సూచించారు.
Damodar Rajanarsimha: వైద్యారోగ్య శాఖ సాహసోపేతమైన నిర్ణయం.. 4356 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఈ సందర్భంగా.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 12 సీట్లు గెలిస్తే రాష్ట్రంలో తర్వాత బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. సర్వేల ప్రకారం తెలంగాణలో 12 సీట్లు గెలువబోతున్నాము.. ఇంకా కష్టపడితే 15 గెలుస్తామని తెలిపారు. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యక్రమాలు చేయండి.. బూత్ కమిటీలు ఉన్నాయా లేవో చెక్ చేసుకోండని సూచించారు. ప్రతి పార్లమెంట్ కి 50 మందితో ఒక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేయండని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ఫోన్ లు చేయించండి.. తాను తన పార్లమెంట్ పరిధిలో 3 లక్షల మందితో కాన్ఫరెన్స్ లో మాట్లాడాను.. మీరు కూడా అలా చేయండని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ప్రతి రోజూ బైక్ లకి బీజేపీ జండాలు కట్టి తిరగండి…అనుకూల వాతావరణం వస్తుందని అమిత్ షా తెలిపారు.
Meera Chopra: ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న పవన్ హీరోయిన్.. ఫొటోలు చూశారా?
అంతేకాకుండా.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. మూడోసారి నరేంద్రమోదీని ప్రధానిగా చూడాలనే భావనలో ప్రజలు ఉన్నారని చెప్పారు. అవినీతి రహిత భారత్ నిర్మాణమే బీజేపీ లక్ష్యం అని తెలిపారు. అంతకుముందు.. ఆయన ఎల్బీ స్టేడియంలో జరిగిన విజయ సంకల్ప సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం చార్మినార్ లో భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు.