ఐపీఎల్ లో ఎక్కువ క్రికెట్ అభిమానులు ఉన్న జట్లు ఏవైనా ఉంటే.. అవి చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్. ఎందుకంటే.. తన అభిమాన కెప్టెన్లు ఉండటం వల్లనే ఆ జట్లకు ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఐపీఎల్ లో చెన్నై, ముంబై మ్యాచ్ ఉందంటే చాలు.. టీవీలకు, ఫోన్లకు అతుక్కుపోతారు. తమ అభిమాన కెప్టెన్లు ఉండటం వల్ల, వారు ఆటలో రచించే వ్యూహాలు అభిమానులకు నచ్చుతాయి కాబట్టి.. ఆ జట్లకు అంతా క్రేజ్ ఉంది.
IPL 2024: కొత్త కెప్టెన్ను ప్రకటించిన చెన్నై సూపర్ కింగ్స్..
ఐపీఎల్ లో గ్రేటెస్ట్ కెప్టెన్ల శకం ముగిసింది. ముంబై కెప్టెన్ గా రోహిత్ శర్మ, చెన్నై కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీని ఐపీఎల్ లో చూడలేం. వీరిద్దరూ ఐపీఎల్ లో తమ జట్లకు చెరో ఐదు ట్రోఫీలను అందించిపెట్టారు. ఐపీఎల్ చరిత్రలో ధోనీ, రోహిత్ కలిసి 10 ట్రోఫీలు గెలువగా.. మిగతా అందరూ కెప్టెన్లు కలిపి 6 ట్రోఫీలను గెలిచారు. ఇక వీరి కెప్టెన్సీ వ్యూహాలు ఇక మైదానంలో కనిపించవు.. ఈ క్రమంలో అభిమానులు పోస్ట్ లు పెడుతున్నారు. ‘వి మిస్ యువర్ కెప్టె్న్సీ’ అంటూ పోస్టులు చేస్తున్నారు. సారథిగా మహేంద్ర సింగ్ ధోని 226 మ్యాచ్ ల్లో 133 విజయాలను అందుకున్నారు. రోహిత్ శర్మ 158 మ్యాచ్ ల్లో 87 గెలిచారు.
Vishwambhara : చిరు ఇంట్లో ‘విశ్వంభర’ మ్యూజిక్ సిట్టింగ్స్.. వైరల్ అవుతున్న వీడియో..
ఇప్పటికే.. సారథిగా జట్టు నుంచి రోహిత్ శర్మ, తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గత ఐపీఎల్ లో ధోనీ.. వచ్చే ఐపీఎల్ ఆడుతానంటూ ప్రకటించినప్పటికీ ధోనీపై ఆశలు అలానే ఉన్నాయి. తాజాగా.. కెప్టె్న్సీ నుంచి తప్పుకోవడంతో, అసలు ఐపీఎల్ ఆడుతాడా లేదా అనేది అభిమానుల్లో సస్పెన్స్ గా మారింది. ఇక.. ముంబై ఇండియన్స్ తరుఫున రోహిత్ స్థానంలో హార్థిక్ పాండ్యా సారథ్య బాధ్యతలు చేపడుతున్నాడు. ధోనీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా నియామకం అయ్యాడు.