భారతదేశ ప్రజలు హోలీ పండుగకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. రంగులు జల్లుకుంటూ ప్రతీ ఒక్కరు సంబరాలు జరుపుకునే ఈ పండుగ కోసం.. ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తుంటారు. దేశంలో ప్రతీ వీధి, ప్రతీ ప్రాంతం రంగులతో నిండిపోయే ఏకైక వేడుక ఇదే. అయితే హోలీ జరుపుకోవడంలో ప్రతీ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అందుకనే ఉన్నవాటిలో ఉత్తమమైనవి ఏవో తెలుసుకుంటే.. ఈ సారి హోలీని ఎంజాయ్ చేయడానికి ముందుగానే సిద్ధం కావచ్చు. ఇండియాలో హోలీ జరుపుకునేందుకు బెస్ట్ ప్రాంతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మధుర
కృష్ణ భగవానుడి జన్మస్థలం, మధుర పురాతన దేవాలయాలు, అందమైన ఘాట్‌లు, రంగురంగుల మార్కెట్‌లతో నిండిన ఐకానిక్ నగరం. హోలీ జరుపుకోవడానికి ఇది ఉత్తమమైన ప్రదేశం. మీరు మధురలో ఉన్నప్పుడు.. కృష్ణ జన్మభూమి దేవాలయం మరియు విశ్రమ్ ఘాట్‌లను తప్పక సందర్శించాలి. మధురలోని బర్సన శ్రీకృష్ణుని ప్రేయసి రాధ పుట్టిన ప్రదేశం. ఇక్కడ హోలీ పండుగను ‘లాథ్ మార్ హోలీ’ అని పిలుస్తారు. మథురకు థామస్ కుక్ అందిస్తున్న ప్రత్యేకమైన హోలీ ట్రిప్‌ను మిస్ చేసుకోకండి.
పురులియా, పశ్చిమ బెంగాల్
పురులియా పశ్చిమ బెంగాల్ లో ఉంది. ఇక్కడ.. రంగులతో పాటు సాంప్రదాయ చఊ నృత్యంతో హోలీని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ వారు చేసే డ్యాన్స్ మీరు ఇప్పటివరకూ చూసి ఉండరు.. అసలు మిస్ కాకూడని దృశ్యం.
ఆనంద్‌పూర్ సాహిబ్, పంజాబ్
ఆనంద్‌పూర్‌లో హోలీ రోజున ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్షల్ ఆర్ట్స్, శారీరక సామర్ధ్యం వంటి ప్రదర్శనలతో వేడుకలు జరుగుతాయి. వీటిని చూసేందుకు చాలామంది వస్తుంటారు.
వారణాసి
వారణాసి హోలీ పండుగకు కరెక్ట్ ఛాయిస్. వారణాసి హోలీ ప్యాకేజ్‌ను ఉపయోగించుకుని ఎన్నో సౌలభ్యాలను పొందవచ్చు.
ముంబై
కలల నగరం అయిన ముంబైలో హోలీ వేడుకలు ఎంతో అద్భుతంగా జరుగుతాయి. ప్రతీ వీధిలోను రంగులు, సంగీతంతో హోరెత్తిపోతాయి. ఇక్కడ హోలీ వేడుకలను తెగ ఎంజాయ్ చేయచ్చు.
గోవా
గోవాలో హోలీ వేడుకలు అద్భుతంగా ఉంటాయి. గోవాలో హోలీని ‘షిగ్మో’ అంటారు. బాండ్స్, పరేడ్స్, రాత్రివేళల్లో జరిగే మ్యూజికల్ ఈవెంట్స్‌ను గోవా హాలిడే ప్యాకేజ్‌లలో భాగంగా ఎంజాయ్ చేయవచ్చు.
ఇండోర్
ఇండోర్ లో హోలీ వేడుకలు చాలా బాగా జరుగుతాయి. మొత్తం నగరం అంతా ఒక్కచోటకు చేరి డ్యాన్స్ చేసే సన్నివేశం కళ్లనుంచి చెదిరిపోవడం అసాధ్యం.