ఐపీఎల్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఒక జట్టు తర్వాత ఒక జట్టు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. ఇప్పటికే సీఎస్కే బౌలర్ మహీష్ పతిరణ గాయం కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు దూరం కానుండగా.. తాజాగా రాజస్థాన్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా లీగ్ నుంచి తప్పుకొంటున్నట్లు సమాచారం తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఐపీఎల్ కు దూరం కానున్నాడు. కాగా.. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ మేనేజర్ తెలిపారు.
Holi 2024: మీ స్నేహితులతో కలిసి ఈ ప్రదేశాల్లో హోలీ సెలబ్రేట్ చేసుకోండి..? ఇవి స్పెషల్
ఐపీఎల్-2023 మినీ వేలంలో ఆడం జంపాను రాజస్తాన్ రాయల్స్ రూ. 1.50 కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది అతడు రాజస్తాన్ తరఫున ఆరు మ్యాచ్‌లు ఆడగా 8 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో 2024 వేలానికి ముందు రాజస్థాన్ జంపాను రిటైన్ చేసుకుంది. కాగా.. ఇప్పుడు జట్టు నుంచి తప్పుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రాజస్థాన్ జట్టులో ఉండే.. టీమిండియా ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ కృష్ణ కూడా ఈ ఎడిషన్ ఆడటం లేదు.
Dharmana Prasada Rao: ప్రజలు ఇంటెలిజెంట్‌గా వ్యవహరించాలి.. డబ్బు ఇస్తే తీసుకోండి..
శుక్రవారం (మార్చి 22న) చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. మార్చి 24న రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జెయింట్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విభాగంలో.. టీమిండియా దిగ్గజాలు రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్ ఉన్నారు. ఈ ఇద్దరు బౌలర్లు ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.