భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో హ్యుందాయ్ మోటార్ పేరు సుపరిచితమే!.. అనేక సంవత్సరాలుగా ఈ బ్రాండ్ నుంచి వస్తున్న కార్లు వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. దేశీయ కారు అమ్మకాలలో హ్యుందాయ్ రెండో స్థానంలో ఉంది. ఆకర్షించే డిజైన్లు, అద్భుత ఫీచర్లతో ఈ సంస్థ నుంచి వస్తున్న కార్లు భారత కస్టమర్లను ఎంతో ఆకర్షిస్తాయి. అయితే.. హ్యుందాయ్ మోటార్స్ 2025 ఫిబ్రవరిలో భారత మార్కెట్లో మూడు ప్రధాన కార్ల ధరలను పెంచింది. వీటిలో హ్యుందాయ్ వెర్నా, హ్యుందాయ్ గ్రాండ్ నియోస్ i10, హ్యుందాయ్ వెన్యూ N-లైన్ కార్ల ధరలు పెరిగాయి. ఇప్పుడు ఈ కార్లు తక్కువ ధరలో అందుబాటులో లేవు.
హ్యుందాయ్ వెర్నా:
ప్రారంభ ధర: రూ.11.07 లక్షలు (ఎక్స్-షోరూమ్)
టాప్ వేరియంట్ ధర: రూ.17.55 లక్షలు
ధర పెరుగుదల: రూ.7,000
హ్యుందాయ్ గ్రాండ్ నియోస్ i10:
ప్రారంభ ధర: రూ.5.98 లక్షలు (బేస్ వేరియంట్)
టాప్ వేరియంట్ ధర: రూ.8.62 లక్షలు
ధర పెరుగుదల: రూ.15,200
హ్యుందాయ్ వెన్యూ N-లైన్:
ప్రారంభ ధర: రూ.12.15 లక్షలు (ఎక్స్-షోరూమ్)
టాప్ వేరియంట్ ధర: రూ.13.97 లక్షలు
ధర పెరుగుదల: రూ.7,000
2024 డిసెంబర్‌లో ప్రకటించిన ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ ధరలు 2025లో పెరిగాయి. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కార్లు భారతదేశంలో ప్రస్తుత ధరలతో అందుబాటులో ఉన్నాయి.