సార్వత్రిక ఎన్నికలను బీఆర్ఎస్ సమాయత్తమైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు అందజేయనున్నారు.
జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు నిస్సాన్ మాగ్నైట్‌ను నాలుగు మీటర్ల SUV విభాగంలో అందించింది. ఈ SUVలో లోపం ఉన్నట్లు కంపెనీకి సమాచారం అందింది. ఆ తర్వాత కొన్ని యూనిట్లు రీకాల్ చేయబడ్డాయి. లోపం గురించి సమాచారం అందుకున్న తర్వాత, ఆ కంపెనీ తన SUVని రీకాల్ చేసింది. నిస్సాన్ మాగ్నైట్ SUVలో సెన్సార్ పనిచేయకపోవడం గురించి సమాచారం అందింది. దీంతో.. కొన్ని యూనిట్లు రీకాల్ చేశారు. అయితే ఎన్ని యూనిట్లను రీకాల్ చేశారనే దానిపై కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వెళ్తున్న ఏఎస్‌ఐపై ముఖేష్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటన మీట్ నగర్ ఫ్లై ఓవర్ దగ్గర జరిగింది. ఈ కాల్పుల్లో ఏఎస్ఐ దినేష్ శర్మతో పాటు, బైక్ పై వెళ్తున్న అమిత్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన అనంతరం.. నిందితుడు ఓ ఆటోను బలవంతంగా ఆపి అందులో కూర్చోని తాను గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల దాడిలో ఏఎస్సై మరణించాడు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏఎస్‌ఐతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ 2023 తుది ఫలితాలు ఈరోజు విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలలో మొత్తం 1,016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. అందులో.. ఆదిత్య శ్రీవాత్సవకు తొలి ర్యాంకు వచ్చింది. శ్రీవాత్సవ లక్నోకు చెందిన నివాసి.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు బిగ్ ఫైట్ జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో చాలా రికార్డులు నమోదయ్యాయి. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. మ్యాచ్ కు హైలెట్ అంటే దినేష్ కార్తీక్ అని చెప్పాలి. దాదాపు మ్యాచ్ గెలిచినంత దగ్గరగా తీసుకొచ్చాడు. డీకే ఔట్ కాకుండా ఉంటే.. ఆర్సీబీ మ్యాచ్ గెలిచే అవకాశం ఉండేది. ఈ…
సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 19 రోజుల తర్వాత తన సొంత రికార్డును తానే బద్దలు కొట్టింది. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద స్కోరును సాధించింది. కాగా.. దానిని SRH స్వయంగా బ్రేక్ చేసింది. ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోరు సాధించింది. ఆర్సీబీ బౌలింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లు విధ్వంసంగా ఆడారు. ఓపెనింగ్ జోడీ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తొలి వికెట్‌కు 108 పరుగులు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ బౌలర్లపై సన్ రైజర్స్ బ్యాటర్లు ఊచకోత చూపించారు. బెంగళూరు ముందు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని ముందుంచారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఆకాశమే హద్దుగా సన్ రైజర్స్ బ్యాటర్లు చెలరేగారు. చినస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించారు. వరుస సిక్సర్లతో సన్ రైజర్స్ బ్యాటర్స్ విరుచుకుపడ్డారు. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ సెంచరీతో రాణించాడు. కేవలం 41 బంతుల్లో 102 పరుగులు…
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పంటల భీమా -2024 అమలుకు సంబంధించి అధికారులు పంపిన ప్రతిపాదనలను పరిశీలించి, ఎన్నికల సంఘం అనుమతితో.. ఈ ఖరీఫ్ కాలానికి పంటల భీమా పథకం అమలు చేసే విధంగా టెండర్ల ప్రక్రియ చేపట్టవల్సిందిగా ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఏ ఒక్కరైతు, ఏ ఒక్క ఎకరానికి ప్రకృతి విపత్తుల వలన పంట నష్టపోయో సందర్భం ఇక ఉండకుండా.. ఈ పంటల భీమా పథకాన్ని అమలు చేస్తామని తెలియచేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో సంబంధిత అధికారులు సంస్థలతో చర్చించి రుణమాఫీ…
వైసీపీ అధినేత జగన్ గన్నవరం నియోజకవర్గంలో పర్యటిస్తున్న వేళ ఆ పార్టీకి వైసీపీ నాయకులు ఝలక్ ఇచ్చారు. గన్నవరం మండలం కొండపావులూరు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ కన్వీనర్ కంచర్ల లక్ష్మణ్ రావు(పండు), వార్డు సభ్యులు గజగంటి వేణు.. వైసీపీని వీడి గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో సోమవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీకి జనాధరణ పెరుగుతుందన్నారు. నియోజకవర్గంలో పసుపు జెండాకు తప్ప మిగతా పార్టీలకు చోటు లేదని…
ఉత్తరాంధ్రలో 35 సీట్లు గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లను కోరారు. రాజాంలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడారు. రాజాం సముద్రాన్ని మించిన జనసంద్రం ఇదని.. ఈ కార్యక్రమానికి జనాలు కమిట్ మెంట్ తో వచ్చారన్నారు. తాగునీటి కోసం ఉత్తరాంధ్రా సుజల స్రవంతి కోసం పోలవరం, వంశదార అనుసంధానం వల్ల తాగు, సాగు నీరు వస్తుందని తెలిపారు. దీనికి 2 వేల కోట్లు ఖర్చు పెట్టామని.. వైసీపీ 5 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.