ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై గెలుపొందింది. 20 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ముంబై బ్యాటింగ్ లో రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగినప్పటికీ.. వృధా అయిపోయింది. ముంబై బ్యాటింగ్ లో రోహిత్ శర్మ (105*)పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 11 ఫోర్లు…
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు.. ప్రచారంలో దూసుకుపోతుండగా, మరోవైపు పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా.. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సమక్షంలో గన్నవరం హరిజనవాడకు చెందిన 500 మంది టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా.. తమ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తానంటున్న యార్లగడ్డను గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో సీఎస్కే భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగుల చేసింది. చెన్నై బ్యాటింగ్ లో చివరలో బ్యాటింగ్ కు వచ్చిన ధోనీ హ్యాట్రిక్ సిక్సులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు. చెన్నై బ్యాటింగ్ లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (66), శివం దూబే (66*) పరుగులతో దుమ్ము దులిపారు.…
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు మరో మ్యాచ్ జరుగనుంది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇంట్రస్టింగ్ ఫైట్ జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. వరుసగా రెండు విజయాలను సాధించిన ముంబై.. మరో విక్టరీ సాధించాలని పట్టుదలతో ఉంది. అటు సీఎస్కే కూడా.. ముంబైతో మ్యాచ్ లో గెలుపును నమోదు చేసేందుకు సిద్ధమైంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నోతో జరిగినన మ్యాచ్ లో కోల్కతా ఘన విజయం విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 26 బంతుల్లో ఉండగానే ముగించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ ఫిల్ సాల్ట్ (89) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని ఇన్నింగ్స్ లో 3 సిక్స్ లు, 14 ఫోర్లు ఉన్నాయి. అటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (38) కూడా చెలరేగాడు. కేకేఆర్ బ్యాటింగ్ లో సునీల్ నరైన్…
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరులో స్వర్ణాంధ్ర సాధికారయాత్రలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఫ్యాన్ మూడు రెక్కలు విరిగిపోతాయని దుయ్యబట్టారు. మాట తప్పను అంటూ జగన్ ఈ రాష్ట్రానికి మెడలు విరిచేసాడు.. దళితులకు అండగా ఉంటాను అని దళితులను హత్య చేస్తున్నావని సీఎం జగన్ పై మండిపడ్డారు. అక్క, చెల్లెమ్మలు అంటూ ఆస్తిలో హక్కులు అడుగుతున్నావు.. ఇసుక అమ్ముకొని ఎన్ని…
ఏపీ ప్రజల్ని వాతావరణశాఖ అలర్ట్ చేసింది.. రాష్ట్రంలో వడగాల్పులు కొనసాగుతున్నాయి. రానున్న రెండ్రోజుల పాటు తీవ్ర వడగాల్పులు వీస్తాయని ఏపీ వాతావరణశాఖ హెచ్చరించింది. సోమవారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 139 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మంగళవారం 33 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 113 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో.. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. కోల్కతా ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్ లో నికోలస్ పూరన్ అత్యధికంగా (45) పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 4 సిక్స్ లు, 2 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్ (39)…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్ కతా నైట్ రైడర్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మొదట లక్నో బ్యాటింగ్ చేస్తుంది. ఈ క్రమంలో.. లక్నో బ్యాటర్ దీపక్ హుడా కొట్టిన షాట్ ను కేకేఆర్ ఫీల్డర్ రమణదీప్ సింగ్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీంతో.. అతనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్టాండ్స్ లో కూర్చున్న టీమ్ యజమాని షారుక్ ఖాన్ కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టాడు. షారుక్.. చప్పట్లు…
అంబేద్కర్ జయంతి ముందు రోజు సీఎం జగన్ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. ఇది చేతకానితనం వల్ల చేసే పిరికిపంద చర్యగా చెపుతున్నామన్నారు. ఇలాంటి దాడులు చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్ అంటే భయంతోనే ఇలాంటి దాడులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ బలం లేక కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ఆపసోపాలు పడుతున్నారని.. జగన్ కి జనం నుండి వస్తున్న అనూహ్య స్పందన చూసి తట్టుకోలేక దాడులు చేస్తున్నారని వీరభద్రస్వామి పేర్కొన్నారు.