వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పంటల భీమా -2024 అమలుకు సంబంధించి అధికారులు పంపిన ప్రతిపాదనలను పరిశీలించి, ఎన్నికల సంఘం అనుమతితో.. ఈ ఖరీఫ్ కాలానికి పంటల భీమా పథకం అమలు చేసే విధంగా టెండర్ల ప్రక్రియ చేపట్టవల్సిందిగా ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఏ ఒక్కరైతు, ఏ ఒక్క ఎకరానికి ప్రకృతి విపత్తుల వలన పంట నష్టపోయో సందర్భం ఇక ఉండకుండా.. ఈ పంటల భీమా పథకాన్ని అమలు చేస్తామని తెలియచేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితో సంబంధిత అధికారులు సంస్థలతో చర్చించి రుణమాఫీ పథకాన్ని తీసుకొస్తామని, అప్పటివరకు ఆర్థిక రంగ సంస్థలు, ప్రాథమిక సహకార పరపతి సంఘాలు రైతులను పంటరుణాల రికవరీ పేరుతో ఇబ్బందులు పెట్టవద్దని వారిని కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్యము ప్రకటించిన రైతుభరోసా పథకాన్ని అమలు చేసే విధివిధానాల మీద కసరత్తు జరుగుతుందని.. వచ్చే ఖరీఫ్ నుండి దీనిని అమలు చేయుటకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందరికీ అమోదయోగ్యమైన విధానాన్ని రూపోందించి, అర్హులైన వారందరికీ రైతుభరోసా అందజేస్తామని చెప్పారు.
Komatireddy: మంత్రి కోమటిరెడ్డికి ఆట సభలకు ఆహ్వానం
ఇప్పటికే ప్రభుత్వము అన్ని రకాల పంటల కొనుగోలు ఆరంభించిందని, మార్క్ ఫెడ్ ద్వారా పొద్దుతిరుగుడు, శనగ, కంది, మొక్కజొన్న, జొన్న పంటల కొనుగోలు జరుగుతుందని, అదేవిధంగా మార్కెట్ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి నాణ్యత ప్రమాణాల ప్రకారం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, రైతు శ్రేయస్సే పరమావధిగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. వానాకాలం 2024 కు సంబంధించి అన్ని రకాల పంటలకు అవసరమయ్యే విత్తన సరఫరాలో లోటుపాటు లేకుండా చర్యలు తీసుకోవల్సిందిగా ఆదేశించడమైనదని, అదేవిధంగా ఖరీఫ్ కాలానికి ఎరువులను మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు జూన్ నెలారంభం వరకే బఫర్ నిల్వలు ఉండేవిధంగా ఆదేశించామని, ఇప్పటికే నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంచడం జరిగిందని పేర్కొన్నారు.
Salman Khan Firing: సల్మాన్ ఇంటిపై కాల్పుల ఘటనలో కీలక ఆధారాలు లభ్యం!
గత నెలలో కురిసిన వడగళ్ల వానల వలన జరిగిన పంటనష్టానికి సంబంధించి ఎన్యుమరేషన్ పూర్తి అయిందని, ఎన్నికల కమిషన్ అనుమతి రాగానే ప్రభుత్వం పంటనష్ట పరిహారం విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నదని, అనుమతికోసం అధికారులను పురుమాయించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ చేపట్టుటకు ఎన్నికల సంఘం అనుమతులు కోరామని, అవి రాగానే, రైతులకు అవికూడా సబ్సిడిపై అందుబాటులో ఉంచుతామని మంత్రి తుమ్మల చెప్పారు.