Rajesh Veeramalla
Author- NTV Telugu-
Supreme Court: మూక హత్యలను అరికట్టేందుకు ఏం చేశారు..? రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఘాటు ప్రశ్నలు
మూక హత్యలను అరికట్టేందుకు ఏం చేశారని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఘాటు ప్రశ్నలు వేసింది. గోసంరక్షకులు, అల్లరిమూకల కేసులపై తీసుకున్న చర్యల గురించి ఆరు వారాల్లోగా తెలియజేయాలని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం మహిళా సంస్థ పిటిషన్‌ను ఆరు వారాల తర్వాత విచారించాలని నిర్ణయించింది. -
Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్.. 29కి పెరిగిన మృతి చెందిన మావోల సంఖ్య
ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మావోల సంఖ్య 29కి చేరింది. ఛోట్‌బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండా, కరోనార్ మధ్య హపటోలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో.. పోలీసులు, నక్సలైట్ల మధ్య భీకర కాల్పులు జరగగా.. 29 మంది నక్సలైట్లు మరణించినట్లు సమాచారం తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ లో 25 లక్షల రివార్డు ఉన్న నక్సలైట్ కమాండర్ శంకర్ రావు కూడా మరణించినట్లు సమాచారం. -
Balakrishna: చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా మనమే..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్వర్ణాంధ్ర సాకార యాత్ర సభ నిర్వహించారు. ఈ సభలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు. లెజెండ్ సినిమా 400 రోజులు ప్రదర్శించి దేశ చరిత్రలో ఎమ్మిగనూరు నిలిచిపోయిందని తెలిపారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా మనమేనని అన్నారు. ఎన్టీఆర్ నటనకు విశ్వరూపం అని చెప్పారు. మరోవైపు.. మహిళల్లో చంద్రబాబు ఆర్థిక విప్లవాన్ని తెచ్చారని పేర్కొన్నారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు ఇచ్చిన అభినవ భగీరథుడు అని కొనియాడారు. -
KKR vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్..
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈడెన్ గార్డెన్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అందులో భాగంగా టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా.. బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ పాయింట్ల పట్టికలో మొదటి, రెండో స్థానాల మధ్య ఉన్న జట్ల మధ్య జరుగుతుండటంతో ఆసక్తికరంగా ఉండనుంది. -
Maruti Suzuki Swift: వచ్చే నెలలో మారుతి న్యూ స్విఫ్ట్ లాంఛ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి స్విఫ్ట్ నాల్గవ ఎడిషన్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్‌లో అనేక కొత్త అప్‌డేట్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఆటో మోటార్ షోలో మారుతి పేరెంట్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ తన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును ప్రదర్శించింది. అయితే.. ఇండియా-స్పెక్ మోడల్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. యెడ్ (YED) కోడ్ నేమ్‌తో వస్తున్న నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్ (Swift)..… -
AP Election Campaign: ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న బీజేపీ అగ్రనాయకులు..
రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ అగ్రనాయకులు, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్, అమిత్ షా, జేపీ నడ్డాలు రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో అగ్రనాయకులు పాల్లొంటారని తెలిపారు. ఈ ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని.. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకి వెళ్లిపోతున్నారన్నారు. -
KS Jawahar: న్యాయం గెలిచింది.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
అమరావతి: న్యాయం జరగడంలో ఆలస్యమవ్వొచ్చేమో గానీ న్యాయం మాత్రం గెలుస్తుందని మాజీ మంత్రి కేఎస్ జవహార్ అన్నారు. 1996లో జరిగిన శిరోముండనం కేసులో మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులుకు 18 నెలలు జైలు శిక్ష పడటంపై ఆయన స్పందించారు. తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి వెంటనే బహిష్కరించాలన్నారు. లేదంటే దళితుల అణచివేతకు జగన్ లైసెన్స్ ఇచ్చినట్లే అని విమర్శించారు. -
Chhattisgarh Encounter: కంకేర్‌లో పోలీసులు-నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోలు హతం..!
ఛత్తీస్ఘడ్ రాష్ట్రం కంకేర్‌లో పోలీసులు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరుగుతుంది. కంకేర్‌లోని ఛోటేబైథియా పోలీస్ స్టేషన్‌లోని కల్పర్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరుగుతుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 18 మంది నక్సలైట్లు హతమైనట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. ఘటనా స్థలం నుంచి పోలీసులు ఏకే47తో పాటు ఇన్సాస్ రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. -
AP News: ఎన్నికల వేళ మరో ఉన్నతాధికారి బదిలీ..
ఏపీలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచారు. మరోవైపు.. రాష్ట్రంలో అధికారుల బదిలీలు కూడా జరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు పడింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి. వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అతడిని ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు కట్టబెట్టొద్దని, తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
BRS: ఈనెల 18న బీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశం..
సార్వత్రిక ఎన్నికలను బీఆర్ఎస్ సమాయత్తమైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందించనున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఒక్కో అభ్యర్థికి రూ.95 లక్షల చొప్పున చెక్కులు అందజేయనున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi-Om Birla: లోక్‌సభ స్పీకర్‌తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
ట్రెండింగ్
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?