ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్‌లో ఉన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. 2024 ఐపీఎల్ లో తన బ్యాటింగ్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. అయితే.. ఈ సీజన్ తనకు చివరిదని, తర్వాత సీజన్లు ఆడడంటూ ప్రచారం కొనసాగుతుంది. అందుకోసమే గ్రౌండ్ లో ఫ్యాన్స్ ను ఉత్సహపరిచేందుకే విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడని కొందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే.. ఇద్దరు టీమిండియా మాజీ క్రికెటర్స్ ధోనీ, తర్వాత సీజన్లు ఆడుతాడని జోస్యం చెప్పారు.
గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్ హైవేపై నదియాడ్ సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను ఓ కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. వారిలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
ఢిల్లీలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు వెలుగులోకి వచ్చింది. తూర్పు ఢిల్లీలోని షకర్పూర్ ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్య, బావమరిదిని దారుణంగా హత్య చేశాడు. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉండగా.. పోలీసులు అతని కోసం జల్లెడపట్టి అరెస్ట్ చేశారు. కాగా.. హత్య ఘటనపై పోలీసులు విచారించగా.. వారిని హత్య చేయడానికి స్క్రూడ్రైవర్‌ను ఉపయోగించినట్లు నిందితుడు తెలిపాడు. దీంతో.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్.. 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ చరిత్రలో ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన స్పిన్ బౌలర్‌గా చాహల్ నిలిచాడు. 2015లో ఆర్సీబీ తరుఫున ఆడుతున్నప్పుడు ఎక్కువ పరుగులు ఇచ్చాడు. తాజాగా.. తన పాత రికార్డును తానే బద్దలుకొట్టుకున్నాడు.
న్యూయార్క్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బ్రోంక్స్‌లో చోటు చేసుకుంది. దుండగులు స్కూటర్లపై వెళుతూ కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక సిగ్నల్ వద్ద రెండు స్కూటర్లపై వచ్చిన దుండగులు దాదాపు 10 షాట్లు కాల్చినట్లు అసిస్టెంట్ పోలీస్ చీఫ్ బెంజమిన్ గుర్లే వెల్లడించారు.
హాస్టల్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ముఖర్జీ నగర్లోని ఓ పీజీ హాస్టల్లో ఉంటున్న విద్యార్థిని ఈరోజు తెల్లవారుజామున సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని చేరుకుని పరిశీలించారు. తెల్లవారుజామున 3.20 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతురాలు 29 ఏళ్ల స్వాతిగా గుర్తించారు. రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి…
ఐపీఎల్ 2024లో బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. బౌలర్ల కంటే బ్యాటర్ల డామినేషన్ ఎక్కువైంది. ఈ సీజన్ లో పలు జట్లు భారీ స్కోరులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.. నిన్న కేకేఆర్-రాజస్థాన్ మధ్య కూడా భారీ స్కోరు నమోదైంది. ఇరు జట్లు 200కు పైగా పరుగులు చేశాయి. ఈ సీజన్ లో మొదటగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 549 పరుగులు నమోదయ్యాయి. అందులో 38 సిక్సర్లతో సహా 81 బౌండరీలు బాదారు. ఈ క్రమంలో.. కేకేఆర్ మెంటార్ గౌతమ్…
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగడంతో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. 2 వికెట్ల తేడాతో రాజస్థాన్ సూపరీ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో బట్లర్ (107*) అద్భుతంగా ఆడటంతో రాజస్థాన్ విజయాన్ని నమోదు చేసింది. బట్లర్ ఇన్నింగ్స్ లో 60 బంతుల్లో 107 రన్స్ చేయగా.. అందులో 6 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మిడిలార్డర్ బ్యాటర్లు వెంట వెంటనే ఔట్…
అయోధ్యలో సంప్రోక్షణానంతరం శ్రీ రామనవమి వేడుకలను తొలిసారిగా కొత్త ఆలయంలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే రామ నవమికి సంబంధించి ఆలయ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లను చేసింది. ఇదిలా ఉండగా.. రాంలల్లా జన్మదినోత్సవం ఈనెల 17 నుంచి జరుగనుంది. అందుకోసం ఆలయ ట్రస్ట్ అధికారులు పనుల్లో మునిగిపోయారు. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని అందించేందుకు ఆలయ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు లక్షలకు పైగా కొత్తిమీర తరుగుతో కూడిన ప్రసాదాన్ని ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు.