ఒమన్‌లోని మిడిల్ ఈస్ట్ నగరంలో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. సోమవారం కురిసిన భారీ వర్షానికి 13 మంది చనిపోయారు. యుఏఈకి చెందిన ఖలీజ్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒమన్‌లోని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్‌లో తప్పిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా.. ఓ చిన్నారి సహా మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఏపీకి డ్రైవర్ తానేనని.. నష్టపోయిన ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలనే ఉద్దేశంతోనే పోరాటం చేస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇబ్బందుల పాలైన ప్రజల కోసమే బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా వస్తున్నట్లు తెలిపారు. పోరాటం చేయడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చరన్నారు. మోదీ మూడో సారి ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మ్యానిఫెస్టోతో టీడీపీ సూపర్ సిక్స్ లతో జనాల రాత మారుతుందన్నారు. రాజాంలో పూర్వ వైభవం రావాలన్నది తన చివరి కోరికన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన బెంగళూరు.. బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఆడిన 6 మ్యాచ్ ల్లో ఐదింటిలో ఓడిపోయిన ఆర్సీబీ.. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలువాలని పట్టుదలతో బరిలోకి దిగుతుంది. మరోవైపు సన్ రైజర్స్ కూడా ఈ మ్యాచ్ లో గెలిచి మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.
ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజు రోజుకు భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ ఎండల ధాటికి జనాలు అల్లాడిపోతున్నారు. మరోపక్క ఎండలతోనే సతమవుతుంటే.. వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలపింది. ఈ క్రమంలో రేపు (మంగళవారం) రాష్ట్రంలోని 63 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
కాంగోలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. తూర్పు కాంగోలోని గ్రామాలపై దాడి చేసి 11 మందిని చంపారు. అంతేకాకుండా.. కొన్ని వాహనాలను తగలబెట్టగా, మరికొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక అధికారులను ఉటంకిస్తూ.. (AP) వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఉగాండా సమీపంలోని సరిహద్దు ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ గ్రూపుతో సంబంధాలు కలిగి ఉన్న మిత్రరాజ్యాల డెమోక్రటిక్ ఫోర్సెస్ తిరుగుబాటుదారులు చాలా కాలంగా పనిచేస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన యువ స్టార్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ కీలక విషయాలను వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని విషయాలను బయటపెట్టాడు. తాను స్టార్ సింగర్ సిద్ధూ మూసేవాలాకు వీరాభిమానిని అని చెప్పాడు. నిజానికి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ తన 'X' ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో.. అభిషేక్ శర్మ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నాడు. అభిషేక్ క్రికెటర్‌గా మారకపోతే ఏ రంగాన్ని ఎంచుకుని ఉండేవాడని ప్రశ్నించారు. దీనిపై అభిషేక్ శర్మ స్పందిస్తూ..…
అయోధ్య రాంలల్లా దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్.. రామజన్మోత్సవం పురస్కరించుకుని నాలుగురోజుల పాటు దర్శనం, హారతి పాస్ లు రద్దు చేశారు. అందుకు సంబంధించి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సమాచారం అందించారు. రామజన్మోత్సవం ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమైన రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. రామ నవమి రోజున మంగళ హారతి, అభిషేకం, అలంకరణ, రామ్ లల్లా దర్శనం యధావిథిగా కొనసాగుతుందని తెలిపారు.
గుజరాత్లోని బనస్కాంత లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గనిబెన్ ఠాకోర్ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లడుతూ ఏడ్చారు. అంతకుముందు ఎంపీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు భారీగా ట్రాక్టర్ల ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గ ప్రజలు తనను పూల మాలలు వేస్తూ ఆశీర్వదిస్తున్నారంటూ ఏడ్చేసింది.
దివంగత క్రికెటర్ బిషన్ సింగ్ బేడి కోడలు, బాలీవుడ్ నటి నేహా ధుపియా ధోనీ కొట్టిన షాట్లకు ఫిదా అయింది. సంతోషంతో పెద్దగా అరుస్తూ వైల్డ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నేహా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.
ఐపీఎల్ 2024లో భాగంగా.. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్లో గెలుస్తేనే ఆర్సీబీకి ప్లే ఆఫ్స్ కు అవకాశాలు ఉంటాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఆర్సీబీ నేటి మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్తో మ్యాచ్లో కూడా ఓడిపోతే ప్లే ఆఫ్స్ అవకాశాల మరింత సంక్లిష్టం అవుతాయి. ఈ సీజన్లో 6 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ..…