Rajesh Veeramalla
Author- NTV Telugu-
Chandrababu: ఎన్నో తుఫాన్లు చూశా.. మే 13న ఒకటే తుఫాన్
విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు కురిపించారు. శృంగవరపుకోట యుద్ధానికి సై అంటుంది.. కాలు దువ్వుతుంది. దీనికి కారణం.. బాధ, ఆవేదన అని వ్యాఖ్యలు చేశారు. ఒకటే నినాదం.. వైసీపీ ఓడిపోవాలని తెలిపారు. ఎన్నో తుఫాన్లు చూశా.. మే 13న ఒకటే తుఫాన్ అని అన్నారు. వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవాలని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వంలో ఎవరికైనా రక్షణ ఉందా.. మహిళలకు అస్సలు రక్షణ లేదని చంద్రబాబు పేర్కొన్నారు. -
Memantha Siddham: ‘మేమంతా సిద్ధం’ రేపటి షెడ్యూల్ ఇదే..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 20వ రోజు విజయవంతంగా ముగిసింది. ఇక.. రేపు (మంగళవారం) జరగబోయే యాత్రకు సంబంధించి షెడ్యూల్ వచ్చింది. సీఎం జగన్.. ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీలో యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుంటారు. చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన… -
MI vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై..
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ముంబై ఇండియన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. జైపూర్ లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై.. మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. -
Buggana Rajendranath: మీకు అభివృద్ధి అంటే అర్థం తెలుసా?.. కోట్ల, కె.యి లపై ఫైర్
రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నాయకులు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ మరోసారి డోన్ బహిరంగ సభలో కోట్ల, కె.యి.లపై ఫైర్ అయ్యారు. అభివృద్ధి ఎక్కడ అని అడుగుతున్నారు.. మీకు నిజంగా అభివృద్ధి అంటే అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. మీ దృష్టిలో కేఈ కోట్ల కలవడమే అభివృద్ధా అని మండిపడ్డారు. తాను చేసిన అభివృద్ధి చూడాలంటే వారం రోజులు పడుతుందని చెప్పారు. 2014లో తాను రూ.50 లక్షలతో స్కూలు భవనాన్ని కట్టాలనుకుంటే ఇద్దరు కేకేలు అనుమతులు రాకుండా ఆపారని… -
Botsa Jhansi Lakshmi: అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాలంటే జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలి..
విశాఖ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతీ నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ.. ప్రతీ ఇంటికి వెళుతున్నారు. ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. నేనున్నాంటూ హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలో.. అవంతి శ్రీనివాస్ తరుఫున బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్న రావాలి.. జగనన్న కావాలన్నారు. సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి అందాలంటే.. అభివృద్ధి ప్రతి ప్రాంతంలో జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. -
YCP: వైసీపీ మేనిఫెస్టోకు తుది మెరుగులు..
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అడుగులు వెస్తోంది. మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే వైసీపీ మ్యానిఫెస్టోను మెరుగులు దిద్దేందుకు పార్టీ నాయకులు పూనుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఇవాళ అంతర్గత సమావేశాలు నిర్వహించనున్నారు. -
Pawan Kalyan: రేపే పిఠాపురంలో జనసేనాని నామినేషన్..
రాష్ట్రంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలు పార్టీల అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు దాఖలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు(ఈ నెల 23) పిఠాపురంలో నామినేషన్ వేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు చేబ్రోలు నుంచి గొల్లప్రోలు మీదుగా పిఠాపురం పాదగయ వరకు వేల మందితో ర్యాలీగా తరలివెళ్తారు. శ్రీపాద వల్లభుడు దర్శనం అనంతరం నామినేషన్ వేస్తారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లి లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. పవన్ నామినేషన్ కారణంగా పోలీసులు భారీ… -
Kesineni Nani: భారీ ర్యాలీతో కేశినేని నాని నామినేషన్..
కేశినేని చిన్నికి కేశినేని నాని కౌంటర్ వేశారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిది కార్పొరేటర్ స్థాయి కంటే హీనం అని విమర్శించారు. ఆయనకి 12 లేదా 14 వేల ఓట్లు మాత్రమే వస్తాయి.. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్ధి కూడా విజయం మీకు లేదా మాకు మధ్యే అని చెప్పాడన్నారు. ఫలితాలు చూస్తే అతనికి 12 వేల ఓట్లు వచ్చాయన్నారు. -
Pemmasani Chandrasekhar: నా విజయం ఖరారు.. భారీ మెజార్టీ సాధిస్తా
నా విజయం ఖరారైంది.. భారీ మెజార్టీతో విజయం సాధిస్తాను అన్నారు గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్.. భారీ ర్యాలీగా వెళ్లి ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.. టీడీపీ అధినేత చంద్రబాబు.. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ప్రకటించారు. -
GT vs DC: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ..
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు గుజరాత్ టైటాన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ఢిల్లీ మొదటగా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. గుజరాత్, ఢిల్లీ జట్లు తామాడిన గత మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై సంచలన విజయాలు సాధించి జోష్‌లో ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!