ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్-కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో జోస్ బట్లర్ సెంచరీతో చెలరేగడంతో రాజస్థాన్ ఘన విజయం సాధించింది. 2 వికెట్ల తేడాతో రాజస్థాన్ సూపరీ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ లో బట్లర్ (107*) అద్భుతంగా ఆడటంతో రాజస్థాన్ విజయాన్ని నమోదు చేసింది. బట్లర్ ఇన్నింగ్స్ లో 60 బంతుల్లో 107 రన్స్ చేయగా.. అందులో 6 సిక్సులు, 9 ఫోర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మిడిలార్డర్ బ్యాటర్లు వెంట వెంటనే ఔట్ కావడంతో.. అందరూ కేకేఆర్ గెలుస్తుందనుకున్నారు. కానీ.. బట్లర్ చివరి వరకు ఉండి అద్భుత విజయాన్ని అందించిపెట్టాడు.
రాజస్థాన్ బ్యాటింగ్ లో రియాన్ పరాగ్ (34), పావెల్ (26), జైస్వాల్ (19), శాంసన్ (12), అశ్విన్ (8) పరుగులు చేశారు. కేకేఆర్ బౌలింగ్ మొదట్లో బాగా వేసినప్పటికీ.. చివరలో పరుగులు భారీగా ఇచ్చుకున్నారు. హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్త తలో రెండు వికెట్లు సాధించారు. వైభవ్ అరోరాకు ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. సునీల్ నరైన్ సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్ గా బరిలోకి దిగిన సునీల్.. కేవలం 56 బంతుల్లోనే 109 పరుగులు చేశాడు. అతన్ని విధ్వంసకర ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 13 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత రఘువంశీ (30) పరుగులతో రాణించాడు. చివరలో రింకూ సింగ్ (20) పరుగులు చేశాడు. కేవలం 9 బంతుల్లోనే 20 రన్స్ సాధించాడు. ఫిల్ స్టాల్ (10), శ్రేయస్ అయ్యర్ (11), రస్సెల్ (13), వెంకటేష్ అయ్యర్ (8) పరుగులు చేశారు. దీంతో కేకేఆర్.. భారీ స్కోరును నమోదు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, కుల్దీప్ సేన్ తలో 2 వికెట్లు పడగొట్టారు. ట్రెంట్ బౌల్ట్, చాహల్ కు తలో వికెట్ దక్కింది.