ఏపీకి వాతావరణ శాఖ భారీ వర్షాలు ఉన్నట్లు హెచ్చరించింది. రేపు (ఆదివారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 గం.లకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంతో టాస్ ఆలస్యమైంది. కాగా.. ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా.. రాత్రి 9.15 గం.లకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వర్షం కారణంతో ఇరు జట్లకు ఓవర్లు తగ్గించారు. రెండు టీమ్లు 16 ఓవర్లు ఆడనున్నాయి.
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో హృదయ విదారకమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఉద్యోగులు ఇస్లామాబాద్ నుంచి స్కర్దుకు వెళ్తున్న ఆరేళ్ల చిన్నారి మృతదేహాన్ని విమానంలోకి తీసుకెళ్లడం మర్చిపోయారు. విమాన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆరేళ్ల బాలుడి మృతదేహం విమానాశ్రయంలోనే ఉండిపోయింది. డాన్ కథనం ప్రకారం.. అంతకుముందు చిన్నారి తల్లిదండ్రులు విమానం ఎక్కారు. అయితే.. పిఐఎ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మరణించిన చిన్నారిని ఇస్లామాబాద్ విమానాశ్రయంలో ఉంచారు. దీంతో.. ఎయిర్‌లైన్స్ కంపెనీ ఉద్యోగులు తన కుమారుడి మృతదేహాన్ని విమానం ఎక్కించలేదని తెలియగానే…
మే 13న సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అందుకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మే 8 నుండి 12 తేదీ వరకు హైదరాబాద్ నుండి వివిధ ప్రాంతాలకు రెగ్యులర్ గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు ఉండనున్నాయని తెలిపింది. హైదరాబాద్ నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రోజూ నడిచే 339 సర్వీసులతో పాటు 11వ తేదీన 302, 12 వ తేదీన 206 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. రోజు హైదరాబాద్ నుండి ఒంగోలు…
గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గుంటూరు పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13 ఉదయం ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముగిసిందని.. లిక్కర్ షాపులు బంద్ అయ్యాయని అన్నారు. మరోవైపు.. ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.
ఉత్తరప్రదేశ్లోని ముస్సోరి పోలీస్ స్టేషన్ పరిధిలో 22 ఏళ్ల యువతికి చదువు చెబుతానని చెప్పి రెండేళ్లుగా బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేస్తున్న నిందితుడు మౌలానాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వీడియో తీసి బాలికను బ్లాక్‌మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి గ్రామంలోని మసీదులోని మౌలానా వద్ద చదువుకునేది. రెండేళ్ల క్రితం నిందితుడు యువతిని బెదిరించి అత్యాచారం చేసి దానిని వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో ప్రసారం…
పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలోని రాష్ట్ర రహదారిపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలు వాహనాలను ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో కనీసం ఐదుగురు మరణించగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పురూలియా ఎస్పీ అవిజిత్ బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు నిర్మాణం కోసం కాంక్రీట్‌ను తీసుకెళ్తున్న ట్రక్కు మొదట ఓ బైక్ను ఢీకొట్టగా.. బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6 గంటల తరవాత స్థానికేతరులు కానీ.. రాజకీయ నేతలంతా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని సూచించారు. పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్న చోట మినహాయింపు ఉంటుందని తెలిపారు. మరోవైపు.. అనకాపల్లి, అనంతపురం, ప.గో, తూ.గో, కర్నూలు జిల్లాల్లో నూరు శాతం వెబ్ క్యాస్టింగ్ ఉంటుందని చెప్పారు. మే 13 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని అన్నారు.…
కాకినాడ జిల్లా పిఠాపురంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని, తొలి మంత్రి పదవి హామీ ఇచ్చారు సీఎం జగన్. మరోవైపు.. కుప్పం భరత్ ను కూడా మంత్రి చేస్తానని హామీ ఇచ్చారు. దత్త పుత్రుడు గెలిస్తే పిఠాపురంలో ఉంటాడా? అని సీఎం జగన్ ప్రశ్నించారు. చిన్న జలుబు చేస్తే దత్తపుత్రుడు పిఠాపురం నుంచి హైదరాబాద్ పారిపోయాడని విమర్శించారు. మహిళలు దత్త పుత్రుడును నమ్మే పరిస్థితి ఉందా? అని…
నెల్లూరు రాజకీయాలను టీడీపీ అభ్యర్ధులు నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, రూప్ కుమార్లు నీచ స్థాయికి తీసుకువచ్చారని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలోనే వీళ్ళందరూ దుష్టశక్తులుగా మారిపోయారని దుయ్యబట్టారు. వైసీపీకీ వెన్నుపోటు దారుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్లందరికీ సహకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీచ రాజకీయాలు చేస్తూ గెలవాలని చూస్తున్నాడని తెలిపారు. హైదరాబాద్, కడప, విజయవాడల నుంచి దొంగతనాలు, హత్యలు చేయడంలో.. అసాంఘీక కార్యకలాపాలు చేయడంలో…