డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఒరిస్సాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కి చేరుకుంటారు. గురువారం ఉదయం భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి భద్రలోక్ పార్లమెంట్ నియోజకవర్గంలో యువ నేత రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. గత వారం రోజులపాటు పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రచారం నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్న డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.
Read Also: Delhi rain: ఢిల్లీలో వర్షం.. వేడి నుంచి ఉపశమనం
తుది దశకు చేరుకున్న రాష్ట్ర గీతంపై సమీక్ష చేశారు. పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి ముందు ఒరిస్సా, కేరళ రాష్ట్రాల్లోను డిప్యూటీ సీఎం భట్టి ప్రచారం నిర్వహించారు. ఓ వైపు ప్రచారం నిర్వహిస్తూనే మరో వైపు రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల భారీ సభలను సమన్వయం చేస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో స్థానిక నేతలతో కలిసి మీడియా సమావేశాలు నిర్వహించారు. పార్టీ సోషల్ మీడియా విభాగాలు పనిచేయవలసిన తీరు పైన పార్టీ శ్రేణులను ఆయన సమాయత్తం చేశారు.
Read Also: Attempted Murder Case: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి, మరో ముగ్గురి అరెస్ట్