Rajasingh: మరోసారి బెదిరింపు కాల్స్.. సీఎం నెంబర్ ఇచ్చాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పలు నంబర్ల నుండి ఫోన్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా.. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నెంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా.. బెదిరింపు కాల్స్ పై ఆయన స్పందించారు. ఈ కాల్స్ తనకు కొత్తేమీ కాదని.. వీటిపై గతంలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయినా ఒక బాధ్యత గల పౌరుడుగా పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు ఎక్స్ లో తెలిపారు. గతంలో రాజాసింగ్‌ను చంపేస్తామంటూ దుండగులు బెదిరింపు కాల్స్ చేయడంతో.. పాకిస్థాన్ నుంచి ఆ కాల్స్ వస్తున్నాయంటూ రాజాసింగ్ వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు వచ్చిన కాల్స్‌పై అప్పటి డీజీపీ అంజన్‌కుమార్ యాదవ్‌కు ఫిర్యాదు కూడా చేశారు.
Bomb Threat Case: బాంబ్ బెదిరింపు కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
మరోవైపు ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ… బెదిరింపు కాల్ చేసిన వ్యక్తికి సీఎం రేవంత్ రెడ్డి నంబర్ ఇచ్చానని తెలిపారు. తనకు ఎన్ని నంబర్లు ఉన్నాయని బెదిరింపు కాల్స్ చేసిన వారు అడిగారని.. ఇంకో నంబర్ ఉందని చెప్పి సీఎం రేవంత్ నంబర్ ఇచ్చానని చెప్పారు. ఎమ్మెల్యేలకు బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని.. అందుకే ముఖ్యమంత్రి నంబర్ ఇచ్చానని అన్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారా.. లేదా అనేది చూడాలన్నారు. ఈరోజు తనకు కంటిన్యూయస్ గా బెదిరింపు కాల్స్ వచ్చాయని.. పాలస్తీనాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోందని రాజాసింగ్ వెల్లడించారు. ధర్మం కోసం నువ్వు పనిచేస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. తన ఫ్యామిలీని కూడా చంపేస్తామని బెదిరించారన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్నో కాల్స్ వచ్చాయి.. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. ఇప్పుడు సీఎంగా రేవంత్ ఉన్నాడు.. ఇప్పుడైనా వీటిపై చర్యలు తీసుకుంటారో లేదో అని సీఎం నంబర్ ఇచ్చానన్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..