పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ క్రైస్తవుడిని కొట్టి చంపారు. దైవదూషణ ఆరోపణలపై గత వారం హింసాత్మక గుంపు క్రైస్తవ వృద్ధుడిపై దాడి చేసింది. ఈ క్రమంలో ఆయన మరణించినట్లు సోమవారం పోలీసులు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళ్తే.. రాడికల్ ఇస్లామిస్ట్ తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్తాన్ (TLP) కార్యకర్తలు సర్గోధా జిల్లాలోని ముజాహిద్ కాలనీలో ఉండే.. క్రైస్తవ సంఘ సభ్యులపై దాడి చేశారు. ఇద్దరు క్రైస్తవులను, 10 మంది పోలీసులపై దాడి చేశారు. కాగా.. ఈ దాడిలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా.. క్రైస్తవుల ఇళ్లను, ఆస్తులను తగులబెట్టారు.
Varla Ramaiah: రాష్ట్రంలో అలర్లు చెలరేగే ప్రమాదం ఉంది.. ఈసీకి వర్ల రామయ్య లేఖ
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నజీర్ మసీహ్ అలియాస్ లాజర్ మసీహ్ అనే వృద్ధ క్రైస్తవుడి ఇల్లు, షూ ఫ్యాక్టరీని చుట్టుముట్టారు. అయితే.. ఇస్లాం యొక్క పవిత్రం గ్రంథం ఖురాన్‌ను అవమానించాడని టీఎల్పీ కార్యకర్తలు చెబుతున్నారు. దీంతో.. తీవ్ర ఆగ్రహానికి గురై షూ ఫ్యాక్టరీ, కొన్ని దుకాణాలు, కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది క్రైస్తవులను కాపాడారు.
Laddu: దేశ వ్యాప్తంగా లడ్డూకి పెరిగిన డిమాండ్.. కారణమిదే!
కాగా.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తన్నారు. మరోవైపు.. సర్గోధాలోని కంబైన్డ్ మిలటరీ హాస్పిటల్ (సిఎంహెచ్)లో చికిత్స పొందుతూ క్రైస్తవుడు మసీహ్ ఆదివారం మరణించినట్లు పోలీసులు తెలిపారు.