తీహార్ జైలులో ప్రత్యర్థి ముఠా సభ్యుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక ఖైదీ కత్తిపోట్లకు గురయ్యాడు. హత్య కేసులో విచారణలో ఉన్న ఖైదీ హితేష్‌పై కత్తితో దాడి చేశారు. దీంతో.. అతన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఉదయం 11:15 గంటలకు గోగి గ్యాంగ్‌కు చెందిన హితేష్, టిల్లు తాజ్‌పురియా గ్యాంగ్‌కు చెందిన మరో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. హితేష్‌ను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు.
ఏపీకి డెప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులపై కీలక ఆదేశాలు ఇచ్చింది. కాగా.. తమను రిలీవ్ చేయాలంటూ డెప్యుటేషన్ పై వచ్చిన పలువురు అధికారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. టీమిండియా తొలి మ్యాచ్ ఐర్లాండ్ తో ఆడుతుంది. ఈ క్రమంలో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. 96 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. పూర్తిగా 20 ఓవర్లు ఆడకుండా.. కేవలం 16 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఐర్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 3 వికెట్లతో చెలరేగాడు. ఇక.. ఐర్లాండ్ బ్యాటింగ్ విషయానికొస్తే, గారెత్ డెలానీ ఒక్కడే అత్యధికంగా (26) పరుగులు చేయగలిగాడు.…
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ కీలక ఆదేశాలు చేసింది. కీలక ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దంటూ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే.. రెవెన్యూ శాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూ కేటాయింపుల వంటి ఫైళ్లని నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ మంత్రి పేషీలోని రికార్డులు, ఫైళ్లను జాగ్రత్త పరచాలని పేషీ సిబ్బందికి సూచించింది.
కృష్ణా జిల్లా: గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియా సమావేశం నిర్వహిచారు. తన గెలుపుకు కృషిచేసిన గన్నవరం నియోజకవర్గ ప్రజలకు పాదాభివందనాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. గన్నవరం టికెట్ ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ గెలుపు కోసం కష్టపడి నియోజకవర్గంలో పనిచేశానని.. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాదని ముందుగానే తాను చెప్పానన్నారు. జగన్మోహన్ రెడ్డికి తాను చేసిన సవాల్ను నిజం చేసినందుకు గన్నవరం ప్రజలకు రుణపడి ఉంటానని…
టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్ ఐర్లాండ్‌తో తలపడుతోంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతోంది. ఇక.. పిచ్ పరిస్థితులు, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రోహిత్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లకు వాతావరణం మరియు పిచ్ రెండూ సహాయపడతాయి.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. వైసీపీ నేతలు ఓటమి నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈ సందర్భంగా.. కడపలో మాజీ డిప్యూటి సీఎం అంజాద్ బాషా మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ, నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ విజయం కోసం, తన విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేటర్ గా మొదలైన తన రాజకీయ ప్రయాణం.. రెండు సార్లు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎం వరకు…
నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ & కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రాయలసీమ మరియ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం, కోస్తా కర్ణాటక ప్రాంతంలో మరొక ఆవర్తనం విస్తరించి ఉందన్నారు.
2024 ఎన్నికల్లో విజయం సాధించి.. తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెడుతున్న సినీ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. అందులో కంగనా రనౌత్ నుండి అరుణ్ గోవిల్ వంటి ప్రముఖులు మొదటి సారిగా 18వ లోక్‌సభలో కాలుమోపనున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి దేశంలో ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. కాగా.. ఈసారి జరిగిన ఎన్నికల్లో పలువురు ప్రముఖులు విజయం సాధించి పార్లమెంటులోకి రావడానికి సిద్ధమయ్యారు.
గుజరాత్‌లోని కచ్ తీరంలో రూ.130 కోట్ల కొకైన్ను పోలీసులు పట్టుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున గాంధీధామ్ పట్టణం సమీపంలోని క్రీక్ ప్రాంతంలో 13 కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. కొకైన్ పట్టుబడకుండ స్మగ్లర్లు సముద్ర తీరంలో దాచిపెట్టినట్లు కచ్-ఈస్ట్ డివిజన్ పోలీస్ సూపరింటెండెంట్ సాగర్ బాగ్మార్ తెలిపారు. కాగా.. ఎనిమిది నెలల్లో ఈ ప్రాంతంలో ఇంత మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇది రెండోసారని అధికారులు పేర్కొన్నారు.