దేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కాగా.. బీజేపీ లీడ్లో కొనసాగుతుండగా, ఇండియా కూటమి కూడా తగిన పోటీనిస్తుంది. ఇదిలా ఉంటే.. ఎన్నికలకు ముందు అయోధ్య నిర్మాణం చేపట్టిన బీజేపీ.. తాము అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేస్తుంది. కాగా.. అదే ప్రాంతంలో బీజేపీ వెనుకంజలో ఉంది. రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ వెనుకంజలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయోధ్య నగరం గతంలో ఫైజాబాద్ జిల్లాలో ఉంది.
Read Also: Mega Family: పవన్ విజయం.. సంబరాల్లో మెగా ఫ్యామిలీ
2018లో ఫైజాబాద్ జిల్లా అధికారికంగా అయోధ్యగా పేరు మార్చారు. అయినప్పటికీ.. లోక్‌సభ స్థానం ఇప్పటికీ ఫైజాబాద్ అని పిలుస్తున్నారు. కౌంటింగ్ ప్రారంభమైన ఐదు గంటలకు పైగా బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్.. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ కంటే వెనుకంజలో ఉన్నారు. దాదాపు 10,000 ఓట్ల ఆధిక్యం నమోదైంది.
Read Also: Kangana: భారీ మెజారిటీతో దూసుకుపోతున్న కంగనా
ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో ఇండియా కూటమి గణనీయమైన ఆధిక్యంతో ఉన్నట్లు ట్రెండ్‌లు చూపిస్తున్నాయి. భారత కూటమి ఉత్తరప్రదేశ్‌లోని 43 లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మధ్యాహ్నం 1 గంటల వరకు సమాజ్‌వాదీ పార్టీ 34, కాంగ్రెస్ 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 2019లో 62 సీట్లు సాధించిన బీజేపీ 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.