ఇటలీలో ఓ భారతీయ వ్యవసాయ కూలీ మృతి విషాదంగా మారింది. అక్కడ భారతీయ కార్మికుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సత్నామ్ సింగ్ (31) అనే వ్యక్తి బుధవారం రోమ్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గ్రామీణ ప్రాంతమైన ఆగ్రో పాంటినోలోని పొలంలో పనిచేస్తుండగా గాయపడ్డాడు. రెండ్రోజుల పాటు ఆస్పత్రితో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృడుతు పంజాబ్ రాష్ట్రానికి చెందిన మోగా నివాసి.
Read Also: Klin Kaara : రామ్ చరణ్ కూతురుతో మేనత్త ఫోటోలకు ఫోజులు.. కాకపోతే..
వివరాల్లోకి వెళ్తే.. అతను పొలంలో పనిచేస్తుండగా చేతికి కటింగ్ మిషన్ తగిలి చేయి తెగిపోయింది. ఈ క్రమంలో.. యజమాని ఓదార్చింది పోయి, చేతిని రోడ్డు పక్కన పడేశాడు. కాగా.. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఇటలీ ప్రధాని జార్జియా మెలోని దీనిని ఖండించారు. ఇది అవమానవీయ ఘటన అని, ఈ క్రూరత్వానికి కఠిన శిక్ష పడుతుందని తెలిపారు. ఈ క్రమంలో.. దేశ వ్యవసాయ, కార్మిక శాఖ మంత్రి ఈ విషయంపై దృష్టి సారించారు.
Read Also: Tomato prices: టమాటా ధరలకు మళ్లీ రెక్కలు.. సెంచరీ కొట్టిన కిలో ధర
మరోవైపు.. ఈ ప్రమాదంపై వ్యవసాయ యజమాని రెంజో లోవాటో విచారం వ్యక్తం చేశారు. కాగా.. తన గాయానికి కారణమైన యంత్రం దగ్గరికి వెళ్లవద్దని సింగ్ ను హెచ్చరించానని తెలిపారు. కానీ.. అతను పట్టించుకోకుండా దాని దగ్గరకు వెళ్లడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. మరోవైపు.. లోవాటో కుమారుడిపై హత్య ఆరోపణలు వచ్చాయి. అతనే యంత్రంలోకి తోసినట్లుగా ఓ ప్రభుత్వ న్యాయవాది చెబుతున్నాడు. ఈ క్రమంలో.. అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.