Wedding Party: పెళ్లి విందులో చపాతీలు లేవని గొడవ.. ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడి
- పెళ్లి విందులో చపాతీల విషయంలో ఘర్షణ
- కొందరు యువకులు వేడి వేడి చపాతీలు తమకు అందలేదని ఆగ్రహం
- యువకులు.. వరుడి కుటుంబీకుల మధ్య గొడవ
- ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్న ఇరువర్గాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బరేలీలోని నవాబ్‌గంజ్‌లో ఓ యువకుడి పెళ్లి విందులో చపాతీల విషయంలో ఘర్షణ తలెత్తింది. అయితే.. కొందరు యువకులు వేడి వేడి చపాతీలు తమకు అందలేదని తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దీంతో.. తమకు చపాతీలు ఇవ్వలేదని నానా హంగామా సృష్టించారు. ఈ క్రమంలో.. యువకులకు, వరుడి కుటుంబీకుల మధ్య గొడవ జరిగింది. దీంతో.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. కాగా.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read Also: CM Revanth: కేంద్రమంత్రి జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం..
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
నగరంలోని మొహల్లా బంజరన్‌లో నివాసముంటున్న మహ్మద్ డానిష్ మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు. అయితే.. ఆదివారం రోజున అతని పెళ్లి జరిగింది. పట్టణంలోని సర్తాజ్ బారత్ ఘర్‌లో శనివారం రాత్రి ఆయన పార్టీ ఏర్పాటు చేశారు. అయితే.. ఆ పార్టీకి హాజరైన కొందరు యువకులు తమకు వేడి వేడి రోటీలు అందించలేదని అక్కడ ఉన్న క్యాంటీన్ సిబ్బందితో గొడవ పడ్డారు. ఆ తర్వాత.. వరుడి కుటుంబీకులు జోక్యం చేసుకుని సర్ది చెప్పే క్రమంలో.. వారితోనూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకోవడంతో పలువురు గాయపడ్డారు.
Read Also: Minister Sandhya Rani: దేశ విదేశాల్లో అరకు కాఫీ ప్రమోట్.. రాష్ట్ర వ్యాప్తంగా చైన్ షాపులు..!
గొడవ జరుగుతున్న సమయంలో అక్కడున్న కొంత మంది.. ఆపడానికి ప్రయత్నించారు. మరికొందరు గొడవ జరుగుతుంటే ఆపకుండా.. ఫోన్లో రికార్డు చేశారు. కాసేపటి తర్వాత.. గొడవ సద్దుమణిగడంతో ఎక్కడ వారు అక్కడికి వెళ్లిపోయారు. అనంతరం.. ఈ గొడవకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే.. ఈ వీడియోను చూసిన స్థానిక పోలీసులు.. ఈ విషయంపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఎవరైనా ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!