Kallakurichi: తమిళనాడు కల్తీ సారా ఘటనలో 58కి చేరిన మృతుల సంఖ్య..
- తమిళనాడు కల్తీ సారా ఘటనలో 58కి చేరిన మృతుల సంఖ్య
- వివిధ ఆస్పత్రుల్లో 156 మంది చికిత్స
- ఈ ఘటనపై రాజకీయ దుమారం
- సీఎం ఎంకే స్టాలిన్ రాజీనామా చేయాలని బీజేపీ.. అన్నాడీఎంకే డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా మరణాల సంఖ్య 58కు చేరింది. మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 156 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 110 మంది కళ్లకురిచి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Also: Rohit Sharma: టీ20 చరిత్రలో ఒకేఒక్కడుగా రోహిత్..
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై రాజకీయ దుమారం రేపుతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రొహిబిషన్ మంత్రి ఎస్. ముత్తుసామిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ను ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ దుర్ఘటన బాధితులను ముఖ్యమంత్రి ఎందుకు పరామర్శించలేదని బీజేపీ ప్రశ్నించింది. మరోవైపు.. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే సోమవారం నిరసన చేపట్టింది.
Read Also: Kerala: కేరళంగా పేరు మారుస్తూ అసెంబ్లీ తీర్మానం ఆమోదం
మరోవైపు.. కల్తీ సారా ఘటనలో మరణించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాల్లోని పిల్లల విద్య, హాస్టల్ ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ తెలిపారు. అలాగే.. తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలకు వారికి 18 ఏండ్లు వచ్చేవరకూ నెలకు రూ. 5000 భృతి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. పిల్లల పేరిట రూ. 5 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ వేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!