రాజ్యసభ సభ్యత్వానికి కే. కేశవరావు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి జగదీష్ ధన్ఖడ్ ను కలిసి రాజ్యసభ ఎంపీ పదవి రాజీనామా లేఖను ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే.. బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎన్నిక అయిన రాజ్యసభ మెంబర్గా కొనసాగలేనని తెలిపారు. నైతికతకు కట్టుబడి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందించారు. ఇవాళ సాయంత్రం గవర్నరును కలిసి రాజీనామా సమర్పించారు. ఈ క్రమంలో.. గవర్నర్ సవాంగ్ రాజీనామాను ఆమోదించారు. కాగా.. వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారని సవాంగ్ పై ఆరోపణలు వచ్చాయి. సవాంగ్ వైసీపీ హయాంలో డీజీపీగా పని చేశారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించారు. అయితే.. సవాంగ్ పదవీ విరమణకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కాగా.. తాజాగా రాజీనామా చేశారు.
వైసీపీ హయాంలో కేంద్రం నుంచి ఏపీకి డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులకు కేంద్రం ఝలక్ ఇస్తుంది. ఏపీ ప్రభుత్వ ఆమోదం లేకుండా మాతృ శాఖల్లో చేరడానికి వచ్చే అధికారులకు నో ఎంట్రీ బోర్డు పెడుతుంది. కేంద్ర సర్వీసుల నుంచి డెప్యూటేషన్ మీద వచ్చిన అధికారులను రిలీవ్ చేయొద్దని గతంలోనే సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ కీలక పోస్ట్ చేశారు. పదవి శాశ్వతం కాదు, బాధితులకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాల్లోకి రావడం అనవసరం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైసీపీ నేత భవనం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని కూల్చటానికి ఎమ్మెల్యే కొలికపూడి నిన్న జేసీబీతో వెళ్లారు. ఈ ఘటనపై కొలికపూడి సహా టీడీపీ నేతలు, క్యాడర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చారు. అయితే.. తాజా ఘటనలతో ఎమ్మెల్యే మనస్తాపంతో పోస్ట్…
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ (APPSC ) ప్రకటన చేసింది. జులై 28వ తేదీన నిర్వహించే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వీరందరి అభ్యర్థన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని పలువురు కోరారు. ఈ క్రమంలో.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేశారు. తదుపరి పరీక్షా తేదీని త్వరలో తెలుపుతామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. జూలై 28న నిర్వహించాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను రెండు నెలల పాటు వాయిదా వేయాలని…
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. తిరిగి ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఫ్రీగా ఇసుక అందించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం.. కలెక్టర్ల అధ్యక్షతన లోడింగ్, రవాణ ఛార్జీల నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత ఇసుక విధానం ఇవ్వాలని సీఎం చంద్రబాబు…
కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్త పల్లి సెంటర్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురం ప్రజలు తనకు చాలా బాధ్యతలు ఇచ్చారన్నారు. ఏలేరు సుద్దగడ్డ ఆధునికీకరణ చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. పిఠాపురంని టెంపుల్ టూరిజంగా డెవలప్ చేస్తామని తెలిపారు. పిఠాపురం ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనన్నారు. 18 నెలల్లో తీరం కోత సమస్యను పరిష్కరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉప్పాడ తీర ప్రాంతంను టూరిజం స్పాట్ గా…
కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి సెంటర్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం తర్వాత తొలి బహిరంగ సభలో పాల్గొన్నారాయన. డిప్యూటీ సీఎంగా వారాహి మీద నుంచి తొలి ప్రసంగం చేశారు. తనను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా.. ఇదే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం హోదాలో తొలిసారి హస్తినకు వెళ్తున్నారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ టూర్ ఉండనుంది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.
ఏపీలో టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఈ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటించనుంది. మంత్రి నారా లోకేష్‌ను కలిసి టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరారు. ఈ క్రమంలో.. టెట్, మెగా డీఎస్సీ సన్నద్ధతకు సమయమిచ్చే అంశంపై విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. అభ్యర్థుల వినతిని పరిగణనలోకి తీసుకున్న మంత్రి లోకేష్.. టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.