ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ పాపాలు.. రైతుల పాలిట శాపాలుగా మారాయని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది.. జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు, గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి.. గత ఐదేళ్లల్లో లాకులకు గ్రీజ్ కూడా పెట్టని దుస్థితి అని ఆరోపించారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలో ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి సరిదిద్ద లేనంత నష్టం జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేస్తుందని అన్నారు. ఏపీ గ్లోబల్ లీడర్ గా తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
కాకినాడలో కోనో కాన్ఫరస్ చెట్లను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పువ్వుల పుప్పొడి కారణంగా ఆస్తమా, శ్వాసకోస ఇబ్బందులు వస్తాయి. ఈ క్రమంలో.. కాకినాడ వాసులు ఈ చెట్ల గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. అటవీ శాఖ సమీక్షలో దీనిపై వివరించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా వాటిని తొలగించడం మంచిదని అన్నారు.
బరువు తగ్గిన తర్వాత లేదా ఇతర శారీరక మార్పుల వల్ల స్త్రీ, పురుషుల శరీరంలో స్ట్రెచ్ మార్క్స్ వస్తుంది. ఇది వారికి సమస్యగా మారుతుంది. పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో.. ఒక్కోసారి తమకు ఇష్టమైన దుస్తులు ధరించడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య ముఖ్యంగా క్రాప్ టాప్స్, చీరలు లేదా షార్ట్స్ వంటి దుస్తులు వేసుకుంటే కనిపిస్తుంది.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో గురువారం 14 ఏళ్ల బాలుడు అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కారణంగా మరణించాడు. ఇది ఒక రకమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్, ఇది బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. బాలుడు చెరువులో స్నానం చేస్తుండగా అమీబా ముక్కు ద్వారా బాలుడి శరీరంలోకి ప్రవేశించింది. తర్వాత.. అమీబా మెదడుకు సోకింది. దీంతో బాలుడిని జూన్ 24న ఆసుపత్రిలో చేర్చారు, అయితే అతను చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ కారణంగా గత రెండు నెలల్లో మొత్తం మూడు మరణాలు…
కిడ్నీ రాకెట్ కేసులో వాస్తవాలు వెలుగు వస్తున్నాయి. దీంతో.. ఎన్ఆర్ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తుంది. కిడ్నీ మార్పిడి కేసులో ఎన్ఆర్ఐ ఆసుపత్రి కీలక పాత్ర పోషించింది. కిడ్నీ మార్పిడి చేస్తామని అడ్వాన్స్ కింద పది లక్షలు వసులు చేసి.. డబ్బులు తిరిగి చెల్లించేందుకు సిబ్బంది నిరాకరించింది. మొత్తం రూ. 27 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో.. మోసపోయామని తెలుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
నిమ్స్ ఆస్పత్రిలో సైబర్ మోసానికి గురయ్యారు నిమ్స్ ఫైనాన్స్ సెక్రటరీ. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పేరుతో ఓ సైబర్ మోసగాడు డబ్బులు వసూలు చేస్తున్నాడు. డాక్టర్ బీరప్ప ఫోటోని డీపీగా పెట్టి తాను ఒక మీటింగ్ లో ఉన్నానని అర్జెంటుగా రూ. 50 వేలు పంపాలని బీరప్ప పేరుతో ఫైనాన్స్ కంట్రోలర్ కి వాట్సాప్ మెసేజ్ పంపించాడు. దాన్ని గుడ్డిగా నమ్మిన నిమ్స్ ఫైనాన్స్ కంట్రోలర్ 50 వేలు తన వద్ద లేకపోయినా వేరే ఇంకొకరి దగ్గర చేతి బదులు తీసుకుని సదరు…
తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన నదీ జలాల వాటాను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థంతో పాటు, తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి సోయిలేని తనం ప్రధాన కారణాలుగా మారి తెలంగాణ రైతాంగానికి దశాబ్దాల పాటు నష్టాన్ని కలిగించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
కే.కేశవరావును తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో ఉన్న ఈ ఇరువురు నేతలు కలుసుకున్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ నా సొంత ఇల్లు.. నేను కాంగ్రెస్ మనిషిని' అని అన్నారు. ఇప్పుడు స్వేచ్చ ఫీలింగ్ ఉంది.. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
మల్కాజ్గిరి మరోసారి రాజకీయ కక్షలతో రణరంగంగా మారింది. మల్కాజ్గిరి నియోజకవర్గం మౌలాలి ఆర్టీసీ కాలనీలో రోడ్డు పనులను సందర్శించడానికి వెళ్లిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పై మౌలాలి కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. గత కొంతకాలంగా మౌలాలి డివిజన్ లోని ఆర్టీసీ కాలనీ రోడ్లు మరమ్మతులకు నోచుకోలేదు, తద్వారా స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు.