AP Group-2 Mains: ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. కారణమిదే..?
- ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
- ఏపీపీఎస్సీ (APPSC ) ప్రకటన
- జులై 28వ తేదీన నిర్వహించే ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్
- ఈ క్రమంలోగ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ (APPSC ) ప్రకటన చేసింది. జులై 28వ తేదీన నిర్వహించే గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. వీరందరి అభ్యర్థన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని పలువురు కోరారు. ఈ క్రమంలో.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేశారు. తదుపరి పరీక్షా తేదీని త్వరలో తెలుపుతామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. జూలై 28న నిర్వహించాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను రెండు నెలల పాటు వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువజన జేఏసీ, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనేక మంది అభ్యర్థులు ఎన్నికల విధుల్లో ఉన్నారని, మరికొందరు ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ కాలేకపోయారని తెలిపారు.

Also Read
Read Also: Hathras Stampede: “సంఘ వ్యతిరేక శక్తుల” వల్లే తొక్కిసలాట.. భోలే బాబా ప్రకటన..
ఇదిలా ఉంటే.. టెట్, మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటించనుంది. కాగా.. టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థులు మంత్రి నారా లోకేష్‌ను కలిసి కోరారు. ఈ క్రమంలో.. టెట్, మెగా డీఎస్సీ సన్నద్ధతకు సమయమిచ్చే అంశంపై విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. అభ్యర్థుల వినతిని పరిగణనలోకి తీసుకున్న మంత్రి లోకేష్.. టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెట్ పరీక్ష నిర్వహణకు 90 రోజులు, మెగా డీఎస్సీ నిర్వహణ కు 90 రోజుల సమయమివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే టెట్, డీఎస్సీ నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటించనుంది.
Read Also: Kollu Ravindra: ఇసుక కొరత లేకుండా చూస్తాం.. బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే కఠిన చర్యలు
తాజావార్తలు
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!