జగిత్యాలలో ఉండనిస్తారా వెళ్లగొడతారా అంటూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి ఫొటో ఉన్న ఫ్లెక్సీని మున్సిపల్ సిబ్బంది తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఫొటో ఉండడంతో స్థానిక కౌన్సిలర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. స్పందించిన అధికారులు ఫ్లెక్సీలను తొలగించారు. ఈ విషయం తెలియని జీవన్ రెడ్డి అసహనంతో ఉండమంటారా వెళ్లగొడతారా అంటూ మండిపడ్డారు.
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ ను మంత్రి శ్రీధర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీన్ని ఆఫీస్ అంటారా..? ఇన్ని రోజులు అధికారులు ఏం చేస్తున్నారు..? అంటూ అధికారులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అయినా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వరంగల్ ఆఫీస్ దుస్థితి ఇలా ఉందని అధికారులను నిలదీశారు మంత్రి శ్రీధర్ బాబు.
రాష్ట్ర స్థాయి అత్యున్నత నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్), తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్‌బీ) ఆధునీకరణకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రిని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కలిశారు. సుమారు గంటపాటు కొనసాగిన భేటీలో వివిధ అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఈనెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరగనుంది. ఇంతకు ముందు చాలాసార్లు ఇరువురు సీఎంలు భేటీ అయినా... ఇప్పుడు మాత్రం గురుశిష్యులు ప్రచారంలో ఉండి వీళ్లిద్దరు తొలిసారి సీఎంల హోదాలో కలవనుండటంతో తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విభజన సమస్యలు పరిష్కారం కోసం చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపి ముందుగా లేఖ రాయగా.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సింగరేణి బొగ్గు గనులు, పెండింగ్ లో ఉన్న విభజన హామీలు, రక్షణ శాఖ భూముల బదిలీతో పాటు మొత్తం 12 అంశాలపై వినతి పత్రాలు అందించారు.
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ నియామకం పై ఏఐసీసీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బాల్ ఏఐసీసీ కోర్టులో ఉంది.. ఎందుకు ఆలస్యం అవుతుందనేది ఏఐసీసీ అధిష్టానం చెప్పాలన్నారు.
టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ట్రోఫీ సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈరోజు ఉదయం భారత క్రికెటర్లు స్వదేశానికి వచ్చారు. అనంతరం.. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ప్రధానితో కలిసి భారత ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ప్రతీ క్రికెటర్‌ను ప్రధాని ఆప్యాయంగా పలకరించి.. అభినందనలు తెలిపారు. టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో ప్రధాని ఫొటోలు దిగారు. ఆటగాళ్లతో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా మోడీని…
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు, టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్ గూడా జైల్లో ఉన్న రాధాకృష్ణ రావును పీటీ వారెంట్ పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలన అంతా.. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టు నడిచిందని లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ మీద తిరుగుబాటు వస్తుందని కేసీఆర్ అంటున్నారు.. ఆరు నెలల కింద కూడా మూడోసారి తమదే రాజ్యం అన్నారు.. చివరకు ఏమైందని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్కు క్లియర్ తీర్పు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారన్నారు. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్, మంత్రులు సెక్రటేరియట్ కే రాలేదని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలగా.. తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్న సీఎం సొంత జిల్లాలోనే ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ…