Kollu Ravindra: ఇసుక కొరత లేకుండా చూస్తాం.. బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే కఠిన చర్యలు
- ఉచిత ఇసుక విధానం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు- కొల్లు రవీంద్ర
- ఇసుక కొరత లేకుండా చూస్తాం..
- బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే కఠిన చర్యలు- మంత్రి కొల్లు రవీంద్ర.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి రానుంది. తిరిగి ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తుంది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఫ్రీగా ఇసుక అందించనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం.. కలెక్టర్ల అధ్యక్షతన లోడింగ్, రవాణ ఛార్జీల నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం చంద్రబాబు ఆదేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉచిత ఇసుక విధానం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్నారు. ఉచిత ఇసుక విధానం అమలుకు విధి విధానాలు రూపొందించుకుంటున్నామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
Jharkhand: ముఖ్యమంత్రి పదవికి చంపయ్ సోరెన్ రాజీనామా
Also Read
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
గత ఐదేళ్ల కాలంలో ఇసుక దోపిడీ జరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులైన పేదల కడుపు కొట్టిందని.. నిర్మాణాలు నిరంతరాయంగా జరగాలనేది సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఉచిత ఇసుక విధానం అమలు అవుతూందని.. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సుమారు కొన్ని నెలల పాటు ఇసుక అందకుండా చేసిందన్నారు. గత ప్రభుత్వ ఇసుక విధానం వల్ల కొన్ని కోట్ల మంది నష్టపోయారు.. రోడ్డున పడ్డారని తెలిపారు.
Shalini : ఆస్పత్రిలో హీరో అజిత్ భార్య.. ఏమైందంటే..?
రాష్ట్రంలో ఇసుక కొరత అనేదే లేకుండా చూస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఇసుకను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతామన్నారు. ఇసుకను బ్లాక్ మార్కెట్ చేయాలని ఎవరైనా భావిస్తే.. తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వం అనధికారికంగా కొన్ని స్టాక్ పాయింట్లు పెట్టింది.. వాటిని కంట్రోల్‌లోకి తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఇసుకను ఆదాయంగా మలుచుకున్న గత ప్రభుత్వ విధానానికి తాము వ్యతిరేకమని తెలిపారు. ఇసుక మాఫియాలో ఎవరు నిందితులుగా ఉన్నారో.. వారందరి పేర్లు వెలికి తీస్తాం.. అన్ని చర్యలు తీసుకుంటామని కొల్లు రవీంద్ర తెలిపారు.
తాజావార్తలు
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!