KCR: సోయిలేని తనంతోనే మొదటి నుంచి తెలంగాణ ఆగం.. ఉమ్మడి రాష్ట్రంలోని దుర్భర పరిస్థితుల వివరణ
- సోయిలేని తనంతోనే మొదటినుంచీ తెలంగాణ ఆగం- కేసీఆర్
- కవి గోరెటీతో నాటి ఉమ్మడి రాష్ట్రంలోని దుర్భర పరిస్థితులను వివరించిన కేసీఆర్
- తమ హక్కులను కాపాడుకునే దిశగా ఎప్పటికప్పుడు..
- తెలంగాణ ప్రజల్లో చైతన్యాన్ని నింపడంలో కవులు రచయితలు ముందుండాలి- కేసీఆర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన నదీ జలాల వాటాను సాధించుకోవడంలో ఉమ్మడి రాష్ట్రంలో నాటి ఆంధ్రా నాయకత్వ స్వార్థంతో పాటు, తెలంగాణ నాయకత్వం అనుసరించిన నిర్లక్ష్య ధోరణి సోయిలేని తనం ప్రధాన కారణాలుగా మారి తెలంగాణ రైతాంగానికి దశాబ్దాల పాటు నష్టాన్ని కలిగించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. విద్యుత్, వ్యవసాయ రంగంలో తెలంగాణకు ఉద్దేశపూరిత ద్రోహాలను పసిగట్టడంలో నాటి తెలంగాణ నాయకత్వ చైతన్య రాహిత్యం రైతాంగానికి తీరని శాపంగా మారిందని, అటువంటి సంక్లిష్ట పరిస్థిలోంచి తెలంగాణ సమస్యలను అర్థం చేసుకొని కవులు కళాకారులు మేధావుల సాహిత్య సాంస్కృతిక ప్రక్రియ ఒకవైపు టిఆర్ఎస్ రాజకీయ ప్రక్రియ మరోవైపు జమిలిగా సాగి భావజాల వ్యాప్తి చేస్తూ ప్రజలకు అర్థం చేయించి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ సాధించగలిగామని కేసీఆర్ వివరించారు.
Kalki 2898 AD: విజయ్ ను అలా చూపిస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన కల్కి టీమ్
Also Read
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
స్వరాష్ట్ర సాధన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఆరు దశాబ్దాల పాటు జరిగిన నష్టాలను సరిదిద్దుకుంటూ.. ఒక్కొక్కటిగా సవరించుకుంటూ తెలంగాణ అస్తిత్వ గరిమను నిలుపుకుంటూ దేశానికే ఆదర్శవంతమైన ప్రగతిని అందించడానికి పదేండ్ల పాలనాకాలాన్ని ప్రణాళికా బద్ధంగా సద్వినియోగం చేసుకున్నామన్నారు. ఎంతో సహనంతో దార్శనికతతో శాంతియుత పంథాలో చాతుర్యంతో ఉద్యమకాలం నుంచి నిన్నటిదాకా సాగిన రెండున్నర దశాబ్దాల ఈ మొత్తం ప్రక్రియను రాగద్వేషాలకు అతీతంగా తెలంగాణ ఆత్మతో లోతుగా అర్థం చేసుకుంటూ సూక్ష్మ దృష్టితో పరిశీలించినప్పుడు మాత్రమే బోధపడుతుందని కేసీఆర్ వివరించారు.
Amaravathi: అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌కు కేంద్ర మంత్రి గ్రీన్‌సిగ్నల్!
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రజా వాగ్గేయకారుడు ఎంఎల్సీ గోరేటి వెంకన్న గురువారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి కవిత్వ పుస్తకాలను కేసీఆర్ కి అందజేశారు. అనంతరం సాగిన ఇష్టాగోష్టి సమావేశంలో తెలంగాణ సాహిత్యం సంస్కృతి రాజకీయాలు తదితర అంశాలపై చర్చించారు. ప్రపంచ నాయకత్వానికి దీటుగా శాంతియుత పద్దతిలో కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం సాగిందని, దేశానికే ఆదర్శంగా పదేండ్ల కేసీఆర్ పాలన సాగిందని గోరెటి వెంకన్న తనదైన సాహిత్య శైలిలో వివరించారు. అదే సందర్భంలో … సీనియర్ జర్నలిస్టు వర్దెల్లి వెంకన్న తన పిట్ట వాలిన చెట్టు’ పుస్తకాన్ని కేసీఆర్ కు అందించారు. ఈ సందర్భంగా పుస్తకాన్ని పరిశీలించిన కేసీఆర్ వర్దెల్లిని అభినందించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులున్నారు.
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?