బరువు తగ్గిన తర్వాత లేదా ఇతర శారీరక మార్పుల వల్ల స్త్రీ, పురుషుల శరీరంలో స్ట్రెచ్ మార్క్స్ వస్తుంది. ఇది వారికి సమస్యగా మారుతుంది. పురుషుల కంటే స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో.. ఒక్కోసారి తమకు ఇష్టమైన దుస్తులు ధరించడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య ముఖ్యంగా క్రాప్ టాప్స్, చీరలు లేదా షార్ట్స్ వంటి దుస్తులు వేసుకుంటే కనిపిస్తుంది.
స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి మార్కెట్లో ఎన్నో రకాల మందులు, క్రీములు అందుబాటులో ఉన్నాయి.. కానీ అవి పని చేస్తాయో లేదో గ్యారెంటీ లేదు. అంతేకాకుండా.. వాటి రసాయనాల వల్ల కూడా చర్మానికి హాని కలిగిస్తాయి. అందువల్ల.. మీరు స్ట్రెచ్ మార్క్స్ సమస్య నుండి బయటపడాలనుకుంటే, మీరు కొన్ని సహజ నివారణలను అనుసరించాలి. ఇది చర్మానికి ఎటువంటి హాని కలిగించదు. అలాగే.. ఈ హోం రెమెడీస్ మీ స్ట్రెచ్ మార్క్స్ రూపాన్ని చాలా వరకు తగ్గిస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడం కోసం ఇంట్లోనే తయారు చేసుకునే చిట్కాలు పాటిస్తే వాటిని నివారించవచ్చు. అవెంటో తెలుసుకుందాం…….
Stock market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్
ఆలివ్, బాదం లేదా కొబ్బరి నూనె మసాజ్
ఆలివ్, బాదం లేదా కొబ్బరి నూనెతో స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట చర్మంపై మసాజ్ చేయడం వల్ల స్ట్రెచ్ మార్క్‌లను తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. అంతే కాకుండా.. ఆముదం కూడా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.
అలోవెరా జెల్, కొబ్బరి నూనె
అనేక పోషక గుణాలు పుష్కలంగా ఉన్న అలోవెరా జెల్ వాడకం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అలోవెరా కేవలం స్కిన్ రిపేర్‌కే ప్రసిద్ధి చెందడానికి కారణం ఇదే. ఈ క్రమంలో.. అలోవెరా జెల్‌తో కొబ్బరి నూనెను మిక్స్ చేసి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో క్రమం తప్పకుండా అప్లై చేయడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ చాలా త్వరగా మాయమవుతాయి.
బంగాళదుంప పేస్ట్
బంగాళాదుంప రసాన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశాలలో అప్లై చేయడం వల్ల మచ్చలు, నల్లటి వలయాలను తొలగిస్తుంది. చాలా త్వరగా గుర్తులను తొలగించడం ప్రారంభమవుతుంది. బంగాళాదుంప పేస్ట్‌ను స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, తర్వాత నీటితో కడగాలి.