Chandrababu, Revanth Reddy: రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం.. అజెండా ఇదే
- తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం అజెండా ఖరారు
- పది అంశాల అజెండాను సిద్దం చేసిన తెలుగు రాష్ట్రాలు
- ఏపీ నుంచి సమావేశానికి హాజరు కానున్న మంత్రులు అనగాని.. బీసీ జనార్దన్ రెడ్డి.. కందుల దుర్గేష్
- అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి సీఎస్.. ఆర్దిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శుల హాజరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. సాయంత్రం 6 గంటలకు వీరి మధ్య భేటీ జరగనుంది. అయితే.. ఇద్దరి సీఎల మధ్య చర్చించాల్సిన అంశాలపై అజెండా ఖరారు అయింది. పది అంశాల అజెండాను తెలుగు రాష్ట్రాలు సిద్ధం చేశాయి. కాగా.. ఏపీ నుంచి సమావేశానికి మంత్రులు అనగాని, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరు కానున్నారు. అలాగే.. అధికారుల బృందంలో ఏపీ వైపు నుంచి సీఎస్, ఆర్దిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శులు హాజరు కానున్నారు. విభజన సమస్యల పరిష్కారం.. నిధులని వెనక్కు తెచ్చుకోవడమే అజెండాగా రేవంత్ తో భేటీ కానున్నారు చంద్రబాబు.
High blood pressure: అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తున్నారా.? చాలా ప్రమాదం..
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
అంతేకాకుండా.. ఏపీ పునర్వవ్యస్థీకరణ చట్టంలోని షెడ్యూలు 9, 10 సంస్థల అస్తుల పంపకాలపై చర్చించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. షీలా బీడే కమిటీ సిఫార్సులను సమీక్షించనున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. తెలంగాణ నుంచి ఏపీకి రావలసిన విద్యుత్ బకాయిలు రూ. 7,200 వేల కోట్లు, ఏపీఎఫ్సీ అంశాల పై చర్చించనున్నారు. అంతేకాకుండా.. ఏపీ-తెలంగాణ మధ్య 15 ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే.. ఉద్యోగుల పరస్పర బదిలీలు, లేబర్ సెస్ పంపకాలు, ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై చర్చించనున్నారు. మరోవైపు.. హైదరాబాదులోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చించనున్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు.. విభజన పూర్తి కానీ సంస్థల బ్యాంకు ఖాతాల్లో రూ 8,000 కోట్లు ఉంది. గత 10 ఏళ్లుగా బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు ఉన్నాయి.
Hardik Pandya: కొడుకుతో కలిసి సంబరాలు జరుపుకున్న హార్దిక్..కనిపించని నటాషా
ఏపీ, తెలంగాణ మధ్య గత 10 ఏళ్లుగా సంస్థల విభజన పూర్తి కాలేదు. ఈ సంస్థలకు చెందిన రూ. 8,000 కోట్లు రెండు రాష్ట్రాలు వినియోగించుకోలేకున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఉంది. అలాగే 9వ షెడ్యూల్‌లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఏపీ జెన్కో విలువ రూ.2,448 కోట్లుగా నిర్ధారణ అయింది. అత్యల్పంగా ఏపీ మార్కెటింగ్ ఫెడరేషన్ మార్క్ ఫెడ్ విలువ ఉంది. 10వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల్లో రూ.2,994 కోట్ల నిధులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే రూ.1,559 కోట్లను పంచుకున్నాయి. కాగా.. రూ.1,435 కోట్ల రూపాయల విషయంలో ఇంకా పంచాయితీ తేలలేదు. చట్టంలో పేర్కొనని సంస్థల విభజన పైనా కూడా సీఎంలు సమీక్ష చేపట్టనున్నారు.
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!