పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడారు. జట్టు విజయం సాధించినందుకు మోడీ అభినందనలు తెలిపారు. జట్టు అనుభవజ్ఞుడైన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్‌కు ప్రత్యేక విజ్ఞప్తి కూడా చేశారు. శ్రీజేష్‌కి ఇదే చివరి మ్యాచ్ కావడంతో అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలికాడు.
Read Also: AP: గనుల శాఖ మాజీ డైరెక్టర్ అక్రమాలపై విచారణ… ఇప్పటికీ దొరకని ఆచూకీ..
భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌తో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘సర్పంచ్ సాహెబ్.. నేను కూడా సర్పంచ్ సాహెబ్ అని పిలుస్తానని అన్నారు. మీకు మరియు మీ బృందానికి చాలా అభినందనలు అని తెలిపారు. మీరు దేశానికి కీర్తి తెచ్చారు.. పరాజయాల పరంపరను ఛేదించారని టోక్యోలో చెప్పినట్లు గుర్తుండే ఉంటుందన్నారు. ఇప్పుడు, మీ నాయకత్వం మరియు జట్టు ప్రయత్నాల క్రింద, తాము పురోగతి సాధించామని తెలిపారు. హాకీలో మేము కలిగి ఉన్న స్వర్ణ కాలాన్ని మీరు తిరిగి తీసుకువస్తారని తాను విశ్వసిస్తున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Read Also: Inspector vs Women: మహిళను చెంపదెబ్బ కొట్టిన ఇన్స్పెక్టర్.. గన్ చూపిస్తూ మరీ..!
మరోవైపు.. ఈ మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించనున్న శ్రీజేష్ గురించి ప్రస్తావించారు. శ్రీజేష్ ఉన్నారా అని హర్మన్‌ప్రీత్‌ను ప్రధాని అడిగారు. అందుకు.. శ్రీజేష్ మాట్లాడుతూ, ‘అవును నేను లైన్‌లో ఉన్నాను’ అని అన్నాడు. శ్రీజేష్ ఎలా ఉన్నావు సోదరా, నీకు అభినందనలు అని ప్రధాని మోడీ ప్రశంసించారు. మీరు చివరకు రిటైర్మెంట్ కూడా ప్రకటించారు, అయితే మీరు కొత్త టీమ్‌ని ప్రకటించాలని మోడీ తెలిపారు.