మూడో విడత రుణమాఫీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులకు శుభవార్త చెప్పారు. ఆగస్ట్ 15న మూడో విడత రుణమాఫీ చేస్తామని ఈరోజు తెలిపారు. వైరాలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారని అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నుంచే రుణ మాఫీ జరుగనుంది.. ఇది రైతుల అదృష్టమని భట్టి విక్రమార్క చెప్పారు. ప్రతిపక్షాల నాయకులు అంతా కూడా భ్రమల్లో ఉండి పోయారని ఆరోపించారు. రుణమాఫీ చేసి ప్రతిపక్షాలను ఆశ్చర్యంలో కాంగ్రెస్ ముంచెత్తింది.. ప్రతిపక్షాలు ఛాలెంజ్ను నిజం చేయడం కోసం ఆర్థిక మంత్రిగా ఆగస్టు 15న రుణమాఫీ చేస్తున్నామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
Read Also: Shaurya Doval: పాకిస్థాన్ తో భారత్ కు ముప్పు..! బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
జులైలో రెండోదఫా రుణమాఫీ చేశామని.. ఇచ్చిన మాట ప్రకారం ఒక దఫా రైతు రుణమాఫీ చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. లక్షన్నర రుణం ఉన్నవారికి నేరుగా వారి అకౌంట్లో డబ్బులు వేశామని అన్నారు. మొత్తం 5 లక్షల 45 వేల 407 రైతు కుటుంబాలకు రుణమాఫీతో లబ్ది చేకూరిందని.. రెండు దఫాలు కలిపి 12 వేల 289 కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ లో రుణ మాఫీ మాత్రమే కాదు.. రైతు భీమాకు కూడా నిధులు పెట్టామని ఆయన తెలిపారు. మరోవైపు.. రైతుల ప్రీమియంను కూడా వైరా సభలోనే ప్రకటిస్తామని అన్నారు. దీని ద్వారా 40 లక్షల కుటుంబాలకు ఉపయోగపడుతుందని అన్నారు. రూ. 1350 కోట్లను రైతు పంటల భీమాను రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని తెలిపారు. 72 వేల కోట్ల రూపాయలను రైతు అనుబంధం ఉన్న వారికి కేటాయిస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పారు.
Read Also: Heavy rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. లిస్టు ఇదే..!