పేరుకే పెద్ద దవాఖానా.. కానీ అక్కడ ఏ మాత్రం రెస్పాన్స్బులిటీ ఉండదు. బతికున్న మనుషులకేమో కానీ.. చనిపోయిన మృతదేహాలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఇంతకు ముందు ఇలాంటి కేసులు.. చాలా చూశాం. అధికారులు మాత్రం పట్టించుకోనట్లే వ్యవహరిస్తారు. ఇంతకీ ఏ ఆస్పత్రి గురించి అని అనుకుంటున్నారా.. వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రి. ఈ ఆస్పత్రికి కేవలం ఒక వరంగల్ జిల్లా నుంచే కాకుండా.. ఖమ్మం, కరీంనగర్ ఇలా ఇతర ప్రాంతాల నుంచి కూడా రోగులు వస్తుంటారు.
Read Also: Manish Sisodia: కేజ్రీవాల్ ఇంట్లో ఉద్వేగ పరిస్థితులు.. సిసోడియాను హత్తుకున్న కుటుంబ సభ్యులు
వివరాల్లోకి వెళ్తే.. ఎంజీఎంలో దారుణం చోటు చేసుకుంది. నాలుగు రోజుల పసి గుడ్డును కుక్కలు పిక్కోని తింటున్న దృశ్యం దర్శనమిచ్చింది. ఈ ఘటన ఎక్కడో ఆస్పత్రి ఆవరణలోని మూల ప్రాంతంలో కాదు.. అందరూ తిరుగుతుండే క్యాజువాలిటీ ముందు కనిపించింది. అయితే.. ఈ పసికందును కుక్కలు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చాయనే వివరాలను ఆస్పత్రి అధికారులు, పోలీసులు సేకరిస్తున్నారు. పసికందు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మరోవైపు.. ఈ పాప ఎవరి పాప అని పోలీసులు ఆరా తీస్తున్నారు. హాస్పిటల్లో చేరిన వారి పాప కాకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పసికందు శవాన్ని బయటనుండి తీసుకొచ్చాయా లేక ఎవరైనా చనిపోయిన పసికందు బాడీని ఎంజీఎం పరిసరాల్లో వదిలేశారా అని అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంతకుముందు కూడా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
Read Also: UP Serial Killer: వరసగా మహిళల్ని హత్య చేస్తున్న “సీరియల్ కిల్లర్” దొరికాడు..