నీటి పారుదల ప్రాజెక్టులలో పూడిక తీత అంశంపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సయిజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, సహాయ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, నీటిపారుదల శాఖా సలహాదారుడు ఆదిత్యా దాస్, మైన్స్ మరియు జియాలజీ కార్యదర్శి సురేంద్ర మోహన్, డైరెక్టర్ సుశీల్ కుమార్, ఇ. యన్.సి అనిల్ కుమార్, డిప్యూటీ ఇ.యన్.సి కే.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: Mahesh Babu : ఇదెక్కడి లుక్ మావా? తగలబెట్టేసేలా ఉంది!
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పూడికతీతకు కేంద్రం అనుమతులు ఇచ్చిందని అధికారులకు తెలిపారు. అనుమతులు ఇచ్చిన సమయంలో పర్యావరణ అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసిందన్నారు. అందుకు అనుగుణంగా ముందుకు పోదాం.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ముందుకు పోదామని అధికారులకు మంత్రి సూచించారు. పూడికతీత అంశంపై నీటిపారుదల మరియు మైన్స్&జియాలజీ సమావేశమై ఒక నిర్ణయానికి రావాలని తెలిపారు. ప్రాజెక్టులకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండేలా పూడిక తీత పనులు చేపట్టాలని సూచించారు. ప్రాజెక్టుల రక్షణలో రాజీ పడొద్దు.. పూడిక తీత సమయంలో సారవంతమైన మట్టి లభ్యత ఉంటే రైతాంగానికి ఉచితంగా ఇవ్వాలన్నారు. అందుకు గాను రవాణా చార్జీలు రైతులే భరించే విధంగా విధి విధానాలు రూపొందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.
Read Also: Jr NTR: జూ.ఎన్టీఆర్ గురించి వైవీఎస్ ఏంటి అలా అనేశాడు?