టీమిండియా బౌలింగ్ కోచ్గా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ మోర్నీ మోర్కెల్ సెలక్ట్ అయినట్లు క్రిక్ బజ్ (Cricbuzz) తెలిపింది. ఆయన నియామకంపై త్వరలోనే బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ రికమెండ్ చేయడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మోర్కెల్ సెప్టెంబర్ 1 నుంచి బౌలింగ్ కోచ్గా బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం. కాగా.. ఆయన పాకిస్తాన్, ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కోచ్గా పని చేశారు.
Read Also: Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
కాగా.. గౌతం గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపికైన తర్వాత, మోర్నీ మోర్కెల్ భారత బౌలింగ్ కోచ్గా నియమించాలని గంభీర్ పట్టు పట్టాడు. గతంలో గంభీర్, మోర్నీ మోర్కెల్ కలిసి లక్నో సూపర్ జెయింట్స్(LSG) తరపున కోచ్‌గా పని చేశారు. ఈ క్రమంలో బీసీసీఐ మోర్నెల్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించనున్నారు. మోర్కెల్ అంతర్జాతీయ, ఐపీఎల్‌లో సమర్థ కోచ్‌గా గుర్తింపు పొందాడు. 2018లో 39 ఏళ్ల వయస్సులో మోర్కెల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. సాంకేతిక అంశాల్లో మోర్కెల్‌కు బాగా ప్రావీణ్యం ఉంది.
Read Also: Triple Talaq: పాకిస్తానీ మహిళను పెళ్లి చేసుకునేందుకు భార్యకు ‘‘ట్రిపుల్ తలాక్’’
గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు కోచ్‌గా మోర్కెల్ పనిచేశాడు. అయితే పదవీ కాలం ముగియకముందే మోర్కెల్ పాక్ కోచ్‌గా వైదొలిగాడు. మోర్కెల్ దక్షిణాఫ్రికా తరపున 2006- 2018 మధ్య కాలంలో 86 టెస్టులు, 117 వన్డేలు ఆడాడు. 44 టీ 20లు కూడా ఆడాడు. కోచ్‌గా మోర్నీ మోర్కెల్‌కు అపార అనుభవం ఉంది.