భారత్‌తో తమ సొంతగడ్డపై వరుసగా రెండు టెస్టు సిరీస్‌లను కోల్పోయిన ఆస్ట్రేలియాకు ఇప్పుడు తానేంటో నిరూపించుకునే అవకాశం ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. గత రెండు పర్యటనల్లోనూ ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియా.. మూడోసారీ అదే రిపీట్ చేయాలని చూస్తోంది. 33 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి ఈ రెండు టీమ్స్ ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్నాయి. కాగా.. నవంబర్ 22 నుంచి ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రపంచ నంబర్ వన్ టెస్టు జట్టు ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది.
TRAI: స్పామ్ కాల్స్‌ను తక్షణం నిలిపివేయాలని ట్రాయ్ ఆదేశాలు..
ఈ క్రమంలో.. ఐసిసి రివ్యూలో పాంటింగ్ మాట్లాడుతూ, ”ఇది చాలా ఆసక్తికరమైన సిరీస్ కానుంది. ఇక్కడ గత రెండు సిరీస్‌లలో ఏమి జరిగిందో చూస్తే, ఆస్ట్రేలియాలో భారత్‌పై ఆస్ట్రేలియా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. మేము ఇప్పుడు భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడతాము, ఇది రెండవ అత్యంత ముఖ్యమైన విషయం. ఇటీవలి కాలంలో కేవలం నాలుగు టెస్టులు మాత్రమే జరిగాయి. ఐదు టెస్టులపై అందరూ ఉత్సాహంగా ఉన్నారు. పెద్దగా డ్రా అయ్యే టెస్టులు ఉండకపోవచ్చు” అని పాంటింగ్ అన్నాడు. ఇక ఈ సిరీస్.. ఆస్ట్రేలియా గెలుస్తుందని.. నేనెప్పుడూ ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా మాట్లాడను. ఏదో ఒకటి డ్రా కావచ్చు. వాతావరణం బాగుండకపోవచ్చు. అందువల్ల 3-1తో ఆస్ట్రేలియా గెలుస్తుందని అనుకుంటున్నాను” అని పాంటింగ్ స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా 3-1తో గెలుస్తుందని తాను అంచనా వేస్తున్నానని పాంటింగ్ చెప్పాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్, ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడలేదు. అంతకుముందు 1991-92లో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్ ఆస్ట్రేలియాలో పర్యటించింది. అప్పటి నుంచి ఈ రెండు జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌కు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ అని పేరు పెట్టారు. అలాగే.. ఈరెండు జట్ల బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉందని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. మహ్మద్ షమీ అప్పటికి ఫిట్‌గా ఉంటాడని, సిరాజ్ జట్టులో ఉంటాడని తెలుసన్నాడు. అంతేకాకుండా.. బుమ్రా కూడా ఆడతాడు.. రెండు జట్లూ చాలా బలమైన బౌలింగ్ లైనప్‌లను కలిగి ఉన్నాయని పాంటింగ్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగే యాషెస్ పోటీకి భారత్, ఆస్ట్రేలియా మధ్య పోటీ చాలా దగ్గరగా ఉందని పాంటింగ్ అన్నాడు.
Kolkata Doctor case: హత్యాచార ఘటన ఎఫెక్ట్.. కాలేజీలకు NMC కీలక మార్గదర్శకాలు
కాగా.. ఆస్ట్రేలియాలో ఇండియా పర్యటన నవంబర్ 22న మొదలవుతుంది. ఆ రోజు పెర్త్ లోని ఆప్టస్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ జరుగనుంది. ఆ తర్వాత అడిలైడ్ లో డేనైట్ రెండో టెస్ట్ ఉంటుంది. మూడో టెస్టు బ్రిస్బేన్ లో గబ్బాలో, నాలుగోది బాక్సింగ్ డే టెస్ట్ ఎంసీజీలో, ఐదోది న్యూ ఇయర్ టెస్ట్ సిడ్నీలో జరుగుతాయి. సిరీస్ ప్రారంభానికి ముందు ఇండియా అక్కడి ప్రైమ్ మినిస్టర్ ఎలెవన్ తో ఓ డేనైట్ వామప్ మ్యాచ్ కూడా ఆడనుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు దక్కించుకోవడానికి ఇండియా ఈ సిరీస్ గెలవడం తప్పనిసరి. అలాగే.. ఇండియా ఈసారి గెలిస్తే ఆసీస్ గడ్డపై హ్యాట్రిక్ సిరీస్ అవుతుంది.