మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ గల్లంతు అయింది. ఆ మహిళ ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళుతుండగా.. ఒక్కసారిగా ఫుట్‌పాత్ కుంగడంతో.. ఆమె డ్రైనేజీలో పడి కొట్టుకుపోయింది.
Read Also: Fake TTE: ఎంతకు తెగించార్రా.. ఏకంగా నకిలీ టీటీఈగా వసూళ్లకు పాల్పడిన మహిళా..
గల్లంతైన మహిళను విజయలక్ష్మి (45 సంవత్సరాలు)గా గుర్తించారు. ఆమె చిత్తూరు జిల్లా అనిగానిపల్లి గ్రామ నివాసి. విజయలక్ష్మి తన భర్త, కుమారుడితో కలిసి ఫుట్‌పాత్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో ఆమె భర్త, కొడుకు ప్రమాదం నుంచి తప్పించుకోగా.. మహిళ మాత్రం కాలువలో పడి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో.. కౌలాలంపూర్ సివిల్ అథారిటీ వెంటనే సహాయక చర్యలను ప్రారంభించింది. గల్లంతైన మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. ఇప్పటి వరకూ విజయలక్ష్మి ఆచూకీ లభించలేదు. కాగా.. వారు కౌలాలంపూర్‌లో పూసల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
Read Also: Crime: రోజూ తాగొచ్చి తల్లిని కొడుతున్న తండ్రి.. రాడ్డుతో కొట్టి చంపేసిన మైనర్ కొడుకు
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. సమర్థవంతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఓవర్సీస్ తెలుగు సొసైటీ అధికారులను సీఎం ఆదేశించారు.