Asna Cyclone: 10 రాష్ట్రాలకు ‘అస్నా’ తుఫాన్ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలు కూడా
- ముంచుకొస్తున్న అస్నా తుఫాను
- తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ హెచ్చరికలు
- 10 రాష్ట్రాలకు తుఫాన్ ఎఫెక్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరేబియా సముద్రంలో ఏర్పడిన అస్నా తుఫాన్ దూసుకొస్తోంది. గంటకు 13-15 కిమీ వేగంతో పశ్చిమ దిశగా అస్నా దూసుకొస్తున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర వాయువ్య దిశగా క్రమంగా కదులుతోందని పేర్కొన్నారు. అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారి అది కాస్తా తుఫాన్‌గా మారింది. 24 గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ 10 రాష్ట్రాలకు ఉంది. అందులో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. మరోవైపు.. ఆంధ్రా తీరప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయని.. ఈ అర్ధరాత్రికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతాలను దాటుతుందని భావిస్తున్నారు.
Tragedy: మరో తీవ్ర విషాదం.. వాగులో కొట్టుకుపోయి ముగ్గురు దుర్మరణం
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఆంధ్రా, తూర్పు తెలంగాణ భారీ వర్షాల హెచ్చరిక
అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతుంది. దీని కారణంగా కోస్తాంధ్ర, తూర్పు తెలంగాణాలో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే.. రాయలసీమ, కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఒడిశా, దక్షిణ విదర్భ పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కూడా.. తెలంగాణ, విదర్భతో పాటు పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు.. కోస్తాంధ్ర, తెలంగాణాలో ఈరోజు రెడ్ వార్నింగ్ జారీ చేశారు. రేపు కూడా విదర్భలో రెడ్ అలర్ట్ అమలులో ఉండనుంది.
ఈ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం..
రేపు అల్పపీడనం ఉత్తరం వైపు పయనిస్తే మధ్యప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అలాగే.. సెప్టెంబర్ 2-3 తేదీలలో పంజాబ్, రాజస్థాన్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే.. అల్ప పీడన ప్రభావంతో ఈరోజు ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని.. రేపు మరుసటి రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
అస్నా అరేబియా సముద్రం నుండి వాయువ్య దిశగా కదులుతోంది..
సైక్లోనిక్ తుఫాను అస్నా.. ఈశాన్య అరేబియా సముద్రంలో ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది గంటకు 13-15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోంది. దీని స్థానం క్రమంగా ఉత్తర అరేబియా సముద్రం నుండి వాయువ్య దిశగా కదులుతోంది. అల్పపీడన ప్రాంతం మొత్తం భారత ఉపఖండాన్ని దాటి గుజరాత్‌ను దాటి సముద్రాన్ని చేరుకుని తుఫాన్‌గా మారనుంది. ఈ క్రమంలో గుజరాత్‌లో ముందే హెచ్చరికలు జారీ చేశామని అధికారులు చెప్పారు. అరేబియా సముద్రంపై ఏర్పడిన ‘అస్నా’ తుపానుగా మారింది. 1976 తర్వాత ఆగస్టులో అరేబియా సముద్రాన్ని తాకడం ఇదే తొలిసారి. కాగా.. ఈ తుఫాన్ కు పాకిస్తాన్ అస్నా అని పేరు పెట్టింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!