ప్రపంచ ప్రసిద్ధ బాడీబిల్డర్‌గా పేరుగాంచిన ఇలియా యెఫిమ్‌చిక్ గుండెపోటుతో మరణించారు. అతని వయస్సు కేవలం 36 సంవత్సరాలు.. అతను చాలా ఫిట్గా ఉన్నప్పటికీ.. గుండెపోటుతో చనిపోవడం అందరూ షాక్‌కు గురయ్యారు.
ఇటీవల సంభవించిన వరదల కారణంగా సర్వం కోల్పోయిన విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు 'భాష్యం' విద్యాసంస్థలు తమవంతు సహకారాన్ని అందించాయి. ఆపన్నులను ఆదుకోవడంలో సామాజిక బాధ్యతగా ముందుండే భాష్యం విద్యాసంస్థలు తమవంతు సహాయమందించేందుకు విద్యాసంస్థల తరపున మొత్తం రూ. 4 కోట్ల చెక్కును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి శుక్రవారం అమరావతి వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చందబ్రాబునాయుడును కలిసి భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, డైరెక్టర్ భాష్యం హనుమంతరావు, భాష్యం రామకృష్ణ తనయుడు భాష్యం సాకేత్ రామ్ ల చేతుల మీదుగా…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎడమ చేతికి గాయం అయింది. పోలీసులు వెహికిల్ లోకి ఎక్కిస్తున్న సమయంలో హరీష్ రావుకు గాయమైంది. కాగా.. పలువురు బీఆర్ఎస్ నేతలను సైబరాబాద్ పీఎస్ నుంచి కేశంపేట పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలను వాహనాలలో తరలిస్తున్న సమయంలో పలు చోట్ల బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు.
డ్యూటీలో భాగంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు.. భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివారులో దాదాపు రూ.3 కోట్ల విలువైన 4 కిలోల బంగారాన్ని పోలీసులు సీజ్ చేశారు. రోడ్డుమార్గాన తరలిస్తున్న నిందితులు పోలీసులకు చిక్కారు. వారు.. ఆ బంగారాన్ని కోల్‌కతా నుంచి తీసుకువస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తనిఖీల్లో భాగంగా కార్లను తనిఖీ చేస్తుండగా.. కారు డిక్కీలో బంగారం దాచి తీసుకెళ్తున్న ముఠా గుట్టు బయట పడింది.
సైబరాబాద్ సీపీ ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో.. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. హరీష్‌రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. అరికెపూడీ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బయటకొచ్చారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసి 5 గంటలు స్టేషన్ లోనే ఉంచారు. అతనికి 35 (3) BNS యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు తీసుకుని ఎమ్మెల్యే గాంధీ బయటకు వచ్చారు.
పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపులపై ఎలాంటి ఆదేశాలు వచ్చినా.. కాంగ్రెస్ ప్రభుత్వానికే మంచిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటేనే ఈ ఫిరాయింపులు మొదలయ్యాయని తెలిపారు.
సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు పై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీ ఛైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కో-ఛైర్మన్గా దామోదర రాజనర్సింహను నియమించారు. అంతేకాకుండా.. ఈ కమిటీలో నలుగురు సభ్యులను కూడా నియామించారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సైబరాబాద్ సీపీ కార్యాలయానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలు.. జాయింట్ సీపీకిఫిర్యాదు చేశారు. సీపీ లేకపోవడంతో జాయింట్ సీపీకి బీఆర్‌ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లిఖిత పూర్వక ఫిర్యాదు రాసి ఇచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. దాడికి సహకరించిన పోలీసులను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్దేశ పూర్వకంగా పోలీసులు దగ్గరుండి చేయించిన దాడి…
సైబరాబాద్ సీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి నివాసం దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు హరీష్‌రావు, బీఆర్‌ఎస్ నేతలు సీపీ ఆఫీస్‌కు వెళ్లారు. సీపీ ఆఫీస్‌లోకి ముగ్గురు ఎమ్మెల్యేలకు అనుమతి ఇచ్చారు. దీంతో.. ఎమ్మెల్యేలందరినీ అనుమతించాలంటూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.