నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుండి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బయటకొచ్చారు. పోలీసులు ఆయనను అరెస్టు చేసి 5 గంటలు స్టేషన్ లోనే ఉంచారు. అతనికి 35 (3) BNS యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు తీసుకుని ఎమ్మెల్యే గాంధీ బయటకు వచ్చారు. ఆంధ్రా, తెలంగాణ అని కౌశిక్ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నాడు.. కౌశిక్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. తాము కూడా కౌశిక్ పై కంప్లైంట్ ఇచ్చామని పేర్కొన్నారు.
Bandhi Movie Teaser Release: అడవిలో హీరో ఆదిత్య ఓం ‘బంధీ’.. ఎలా బయటపడ్డాడో చూడండి
కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ డిమాండ్ చేశారు. తన వ్యక్తి గత వాఖ్యలు చేశాడా.. పార్టీ వాఖ్యలా చెప్పాలని అన్నారు. పార్టీ వాఖ్యలు అయితే, పార్టీ నాయకులు కేసీఆర్ చర్యలు సమాధానం చెప్పాలని కోరారు. రెండు రాష్టాల మధ్య విద్వేషాన్ని రెచ్చ గొట్టే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారు.. తనను ఐదు గంటల పాటు అరెస్ట్ చేసి నిర్భందించారు. తమ శ్రేణుల మీద దాడులు చేసారని తెలిపారు.
CM Revanth Reddy: కౌశిక్, అరికెపూడి వివాదంపై సీఎం రేవంత్ రియాక్షన్..
మరోవైపు.. పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్లో రాజకీయ సందిగ్ధత కనిపిస్తుందన్నారు. ఓ వైపు కేటీఆర్, హరీష్ లు కొట్లాడుతున్నారు.. పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పదేండ్లు అరికెపుడి గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నాడు, అప్పుడు ఎందుకు అనలేదని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలి.. లేదంటే కేసీఆర్ కౌశిక్ రెడ్డితో మాట్లాడించాడు అనుకుంటారని అద్దంకి దయాకర్ తెలిపారు. సెంటిమెంట్ను వాడుకొని పబ్బం గడుపుకున్న వాళ్ళను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని అన్నారు.
Amaravati: సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై ప్రభుత్వం కసరత్తు
BNS 11 సెక్షన్ల కింద అరికెపూడి గాంధీపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి కేసును సుమోటోగా సైబరాబాద్ పోలీసులు సేకరించారు. ఏ1 అరికెపూడి గాంధీతో పాటు 15 మంది గాంధీ అనుచరులు తదితరులపై కేసు నమోదు చేశారు. గచ్చిబౌలి ఎస్సై మహేష్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. సెక్షన్లు 189, 191(2), 191(3), 61, 132, 329, 333, 324(4), 324(5), 351(2) కింద కేసు నమోదు చేశారు.